‘రక్తదానం ప్రాణదానంతో సమానం’
కామారెడ్డి అర్బన్: రక్తదానం ప్రాణదానంతో సమానమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి పేర్కొన్నారు. సోమవారం వివేకానంద జయంతి సందర్భంగా దేవునిపల్లి లక్ష్మీదేవి గార్డెన్‌లో కామారెడ్డి రక్తదాతల సమూహం, రెడ్‌క్రాస్ సొసైటీ, ఐవీఎఫ్‌ల ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరంలో 147 మంది రక్తదానం చేయగా వారికి ప్రశంస పత్రాలు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సహకారంతో దాతలకు బ్యాగులు అందించారు. 78 మంది ఉత్తమ దాతలకు పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, కార్యక్రమ నిర్వాహకులు బాలు, ప్రతినిధులు వేదప్రకాష్, నాగరాజు, జమీల్‌హైమద్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లిలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో చిలువేరి మారుతి ఆయన తనయుడు అభినవ్ రక్తదానం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ఎంతో మంది చనిపోతున్నారని, రక్తదానం చేయడం బాధ్యతగా భావించి రక్తదానం చేశామని వారు పేర్కొన్నారు.
కామారెడ్డి అర్బన్: హాకీ విశ్వవిద్యాలయాల స్థాయి జాతీయ టోర్నీలో పాల్గొనే ఉస్మానియా విశ్వవిద్యాలయం జట్టుకు కామారెడ్డి మండలం గర్గుల్‌కు చెందిన విజయ్‌కుమార్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని గర్గుల్ హైస్కూల్‌పీఈటీ మధుసూదన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 13 నుంచి 17 వరకు తమిళనాడులో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో విజయ్‌కుమార్ పాల్గొంటాడని పేర్కొన్నారు.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఉద్యోగులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఆర్డీవో సురేందర్ పేర్కొన్నారు. సాక్షి దినపత్రికలో సోమవారం ప్రచురితమైన డీఆర్డీవోలో ఏం జరుగుతోంది అనే కథనంపై ఆయన స్పందించారు. సంస్థలో ఇటీవల చిన్నచిన్న సమస్యలు వచ్చిన మాట వాస్తవమేనన్నారు. సంక్షేమ పథకాల అమలులో అన్ని శాఖలు, అధికారులు, సమాఖ్యల ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఫిర్యాదులు వస్తే శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
‘రక్తదానం ప్రాణదానంతో సమానం’
‘రక్తదానం ప్రాణదానంతో సమానం’


