ఉత్సాహంగా యువ భారత్ 2కే రన్
కామారెడ్డి టౌన్: స్వామి వివేకానంద జయంతి, వందేమాతర గేయాన్ని రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భాలను పురస్కరించుకుని సోమవారం జిల్లా కేంద్రంలో క్రీడా భారతి ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. నిజాంసాగర్‌రోడ్‌లోని సర్దార్ పటేల్ విగ్రహం వద్ద ర్యాలీని ఏఎస్పీ చైతన్యరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ స్వామి వివేకానందుడి ఆశయాలను యువత నెరవేర్చాలన్నారు. సర్దార్ పటేల్ విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీ పుర వీధుల మీదుగా సాగి సరస్వతి శిశుమందిర్ వద్ద ముగిసింది. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ ప్రచారక్ శివకుమార్, క్రీడా భారతి జిల్లా అధ్యక్షుడు కొమిరెడ్డి మారుతి, సంస్కార భారతి ప్రతినిధి డాక్టర్ రాజు, ప్రతినిధులు సుధాకర్, భాస్కర్, శివ, కొమిరెడ్డి స్వామి, జంగం నరేష్ తదితరులు పాల్గొన్నారు.


