‘ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలి’
కామారెడ్డి క్రైం: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటనలు, మున్సిపల్ ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ ఆయా శాఖల జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నోడల్ అధికారులు, జోనల్ అధికారులు, ఫ్లయింగ్, స్టాటిస్టిక్ సర్వేలెన్స్ బృందాలు, సెక్టోరియల్ అధికారులు, నామినేషన్ స్వీకరణ కేంద్రాలు, ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలు, ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలకు శిక్షణ, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లపై వెంటనే తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహాన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆర్డీవో వీణ, తహసీల్దార్లు తదతరులు పాల్గొన్నారు.


