‘పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం’
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని 20, 21, 22, 23 వార్డుల్లో సుమా రు రూ. 80 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, ఇతర అభివృద్ధి పనులకు ఆయన సోమవారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికలు పట్టణ భవిష్యత్తుకు కీలకమన్నారు. ప్రజలు అభివృద్ధిని గమనించి కాంగ్రెస్ పార్టీ కి అండగా నిలవాలని కోరారు. మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగిరితేనే జిల్లా కేంద్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి అవుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు పండ్ల రాజు, గూడెం శ్రీనివాస్, ప్రసాద్, సత్యం తదితరులు పాల్గొన్నారు.
లింగంపేట: ప్రభుత్వ పథకాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందాలంటే తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన మండల కేంద్రంలోని రైతు వేదికలో ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు గుర్తింపు కార్డు ప్రక్రియను వేగవంతం చేయాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. గ్రామాల్లో యాసంగి పంటల సస్యరక్షణ, చీడపీడలు, ఎరువులు, నీటి యాజమాన్యం తదితర విషయాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి అనిల్‌కుమార్, ఏఈవో లు రాకేష్, నవ్య తదితరులు పాల్గొన్నారు.
లింగంపేట: మెంగారం శివారులో చిరుత సంచారంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. నెల వ్యవధిలో కామారెడ్డి, ఎల్లారెడ్డి కేకేవై రోడ్డులో ప్రయాణికులకు చిరుతపులి పలుమార్లు కనిపించింది. మంగళవారం తెల్లవారుజామున ఎల్లారెడ్డి నుంచి లింగంపేట వైపు కారులో వస్తున్న లింగంపేట వాసికి రోడ్డు దాటుతూ చిరుత కనిపించడంతో సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ మార్గంలో ప్రయాణించేవారు భయపడుతున్నారు. రైతులు పొలాలకు వెళ్లడానికీ జంకుతున్నారు. మండలంలోని కంచుమల్, కొండాపూర్, గాంధీనగర్, కోమట్‌పల్లి, లొంకల్‌పల్లి తదితర గ్రామాల శివార్లలో చిరుతలు సంచరిస్తున్నాయని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి, చిరుతలను బంధించాలని కోరుతున్నారు.
‘పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం’
‘పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం’


