పోలింగ్ కేంద్రాల డ్రాఫ్ట్ విడుదల
తుది ఓటర్లు, ముసాయిదా పోలింగ్ కేంద్రాలు..
కామారెడ్డి టౌన్: జిల్లాలోని మున్సిపాలిటీలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను మంగళవారం విడుదల చేశారు. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలో కలిపి మొత్తం 239 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా కామారెడ్డి బల్దియాలో 152 పోలింగ్ కేంద్రాలుండగా.. బాన్సువాడలో 39, ఎల్లారెడ్డిలో 24, బిచ్కుందలో 24 కేంద్రాలున్నాయి. 600 నుంచి 750 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని కేటాయించారు. ఈ ముసాయిదాలో ఏవైనా తప్పిదాలు, అభ్యంతరాలు ఉంటే ఈనెల 15వ తేదీ వరకు తమ దృష్టికి తీసుకురావాలని అధికారులు సూచించారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి ఈనెల 16వ తేదీన పోలింగ్ కేంద్రాల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తామన్నారు. తదుపరి వార్డుల వారీగా బీసీ, ఎస్సీ, ఎస్టీల లెక్క తేల్చి, రిజర్వేషన్‌లను కేటాయించే అవకాశాలున్నాయి.
పట్టణం వార్డులు మొత్తం ఓటర్లు పోలింగ్ కేంద్రాలు
కామారెడ్డి 49 99,313 152
బాన్సువాడ 19 24,188 39
ఎల్లారెడ్డి 12 13,265 24
బిచ్కుంద 12 12,759 24
మొత్తం 92 1,49,525 239
కామారెడ్డిలో 152 కేంద్రాలు..
బాన్సువాడలో 39,
ఎల్లారెడ్డిలో 24, బిచ్కుందలో 24..
15 వరకు అభ్యంతరాలకు అవకాశం
16న ఫొటోలతో కూడిన
తుది జాబితా ప్రకటన


