అంకోల్ క్యాంపు సందర్శన
నస్రుల్లాబాద్: మండలంలోని అంకోల్ క్యాంపుతోపాటు బీర్కూర్ మండలంలోని రైతు నగర్ గ్రామాలను బుధవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అధికారుల బృందం సందర్శించింది. జాతీయ ఉత్తమ పంచాయతీలుగా ఎంపిక కావడానికి గ్రామంలో చేపట్టిన కార్యకలాపాలను అడిగి తెలుసుకున్నారు. అంకోల్ క్యాంప్ గ్రామంలో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్‌ను పరిశీలించి, పనితీరు తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సూర్యకాంత్, సెర్ప్ డీపీఎంలు సుధాకర్, సురేష్, సీ్త్రనిధి ఆర్‌ఎం కిరణ్, మేనేజర్ మహేందర్, ఏపీఎం గంగాధర్,సీసీ సుజాత,నాగరాజ కుమారి, హన్మండ్లు, మాజీ సర్పంచ్ రాము పాల్గొన్నారు.
డ్రగ్స్, మత్తు పదార్థాలపై అవగాహన
నస్రుల్లాబాద్(బాన్సువాడ): మండల కేంద్రంలోని హరిజనవాడలో మంగళవారం డ్రగ్స్ వాడకం, మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనర్థాలపై ఏఎస్‌ఆర్ ఫౌండేషన్స్ ఆధ్వర్యంలో అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ విశాల్ మాటాడారు. డ్రగ్స్, సిగరేట్, మద్యం తాగడంతో కలిగే నష్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఆర్ ఫౌండేషన్స్ వ్యవస్థాపకులు అయ్యాల సంతోష్, మాల సంఘం అధ్యక్షులు ఉల్లెంగ కిరణ్, రాములు,అల్లం చిన్న బందయ్య తదితరులు పాల్గొన్నారు.
పేకాడుతున్న నలుగురి అరెస్ట్
మాచారెడ్డి: పాల్వంచ మండలం ఇసాయిపేట గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడి చేసి బుధవారం నలుగురిని అరెస్ట్ చేసినట్లు మాచారెడ్డి ఎస్సై అనిల్ తెలిపారు. పేకాడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు సిబ్బందితో దాడి చేసి వారి నుంచి రూ. 16,510లు, మూడు సెల్‌ఫోన్లు, మూడు బైకులను సీజ్ చేశామన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
అంకోల్ క్యాంపు సందర్శన


