నాణ్యత, తూకంలో తేడా ఉండొద్దు
రామారెడ్డి: రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న సన్న బియ్యం నాణ్యత, తూకంలో వ్యత్యాసం లేకుండా చూడాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని రేషన్ షాపులో లబ్ధిదారులకు కలెక్టర్ గురువారం సన్నబియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు 47శాతం సన్నబియ్యాన్ని పంపిణీ చేశామని, రామారెడ్డిలో 70శాతం పంపిణీ పూర్తయ్యిందని తెలిపారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడామని, సన్న బియ్యం పంపిణీపై సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రేషన్‌షాపులో నాణ్యత, తూకంలో వ్యత్యాసం ఉంటే వెంటనే సివిల్ సప్లయీస్ అధికారులను సంప్రదించాలని కార్డుదారులకు ఆయన సూచించారు.


