ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి
నిజాంసాగర్/బాన్సువాడ రూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలని జెడ్పీ సీఈవో, మండల ప్రత్యేక అధికారి చందర్‌నాయక్ అన్నారు. గురువారం జుక్కల్ మండలం బంగారుపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, సీసీ రోడ్లు నిర్మాణ పనులు ఆయన పరిశీలించారు. ఇళ్ల స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామన్నారు. బాన్సువాడ మండలం నాగారం గ్రామంలో జెడ్పీసీఈవో చందర్‌నాయక్ పర్యటించారు. గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. పనులు ప్రారంభించని వారు వెంటనే ప్రారంభించాలని సూచించారు. అలాగే గ్రామంలో కొనసాగుతున్న సీసీరోడ్ల పనులు పరిశీలించి నాణ్యతతో చేపట్టాలన్నారు. ఆయన వెంట డీఎల్‌పీవో సత్యనారాయణరెడ్డి, ఎంపీడీవో బషీరుద్దీన్, జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్, పంచాయతి కార్యదర్శి నవీన్‌గౌడ్ తదితరులున్నారు.
నిజాంసాగర్ (జుక్కల్): మండలంలోని సుల్తాన్ నగర్‌లో ఇందిరమ్మ మోడల్ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని ఎంపీడీవో గంగాధర్ లబ్ధిదారులకు సూచించారు. గ్రామంలో ఇందిరమ్మ మోడల్ ఇంటి నిర్మాణానికి ముగ్గులు వేయించారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలని ఆయన సూచించారు. పంచాయతీ కార్యదర్శి రవిరాథోడ్, కాంగ్రెస్ నాయకులు బ్రహ్మం, సాయిలు తదితరులున్నారు.
సీసీ పనులు నాణ్యతతో చేపట్టాలి
జెడ్పీ సీఈవో చందర్ నాయక్


