‘బెట్టింగ్‌ చట్టరీత్యా నేరం’ | - | Sakshi
Sakshi News home page

‘బెట్టింగ్‌ చట్టరీత్యా నేరం’

Mar 25 2025 1:37 AM | Updated on Mar 25 2025 1:33 AM

కామారెడ్డి క్రైం : ఐపీఎల్‌ బెట్టింగ్‌ చట్టరీత్యా నేరమ ని ఎస్పీ రాజేశ్‌ చంద్ర పేర్కొన్నా రు. సులభంగా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే అత్యాశ మంచిది కాదన్నారు. ఇది ఎన్నో స మస్యలకు దారి తీస్తుందన్నారు. బెట్టింగ్‌ కా రణంగా అనేక మంది ఆర్థిక ఇబ్బందుల పా లవుతున్నారన్నారు. ప్రజలు దీనికి దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల ప్రవర్తనపై కన్నేసి ఉంచాలన్నారు. ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

కొనసాగుతున్న

ఎస్సెస్సీ పరీక్షలు

కామారెడ్డి టౌన్‌: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం జరిగిన ఇంగ్లిష్‌ పరీక్షకు 12,579 మంది విద్యార్థులకుగాను 12,556 మంది హాజరయ్యారు. 23 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల నిర్వహణను డీఈవో రాజు పర్యవేక్షించారు.

‘ఫిషరీస్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి’

నిజాంసాగర్‌: జుక్కల్‌ నియోజకవర్గంలో ఫిషరిస్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఆయన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో మాట్లాడారు. విద్య, ఉపాధి అవకాశాల కల్పన దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్న తరుణంలో జుక్కల్‌ నియోజకవర్గంలో ఇంటిగ్రేటేడ్‌ ఫిషరిస్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని మత్స్యశాఖ మంత్రిని కోరారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు పరిధిలో చేప పిల్లల విత్తనోత్పత్తి కేంద్రం ఉందన్నారు. ఇక్కడ ఫిషరీస్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కోరారు.

మున్సిపాలిటీగా బిచ్కుంద

బిచ్కుందను మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్‌ బాబు సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. బిచ్కుంద, గోపన్పల్లి, కందర్‌పల్లి, దౌల్తాపూర్‌ గ్రామాలను కలుపుతూ బిచ్కుంద మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. బిచ్కుంద మండల ప్రజలు, వ్యాపారులు ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుకు, మంత్రి శ్రీధర్‌ బాబుకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

‘మనిషి నియంత్రణలోనే

కృత్రిమ మేధ ఉండాలి’

కామారెడ్డి అర్బన్‌: కృత్రిమ మేధస్సు (ఏఐ) విద్య, వ్యాపారం, వ్యవసాయం అన్ని రంగా ల్లో విస్తరించిందని, మనిషి నియంత్రణలోనే కృత్రిమ మేధ ఉండాలని కామారెడ్డి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ విజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. సోమవారం కళాశాల ఫిజికల్‌ సైన్స్‌ విభాగం ఆధ్వర్యంలో ‘కృత్రిమ మేధస్సు ఆగమనం.. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ’ అంశంపై వర్క్‌షాప్‌ నిర్వహించా రు. ఈ సందర్భంగా వైస్‌ ప్రిన్సిపల్‌ కిష్టయ్య మాట్లాడారు. వర్క్‌షాప్‌లో సమన్వయకర్తలు విశ్వప్రసాద్‌, జయప్రకాష్‌, అధ్యాపకులు రాములు, శ్రీనివాస్‌రావు, మానస, శ్రీవల్లి, రాజశ్రీ, కే.శ్రీనివాస్‌, స్వామి, రాజు, శ్రీలత, భాగ్యలక్ష్మి, రాంప్రసాద్‌, అనిల్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

155 రకాల

వంగడాల ప్రదర్శన

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): మధ్యప్రదేశ్‌లోని ఉజ్జ యిని నగరంలో ఇండియా ఫార్మర్స్‌ 68వ కౌన్సిల్‌ సమావేశం సోమవారం నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వెయ్యి మంది రైతులు సమావేశానికి హాజరుకాగా, రాష్ట్రం నుంచి ఐదుగురు పా ల్గొన్నారు. ఇందులో జక్రాన్‌పల్లి మండలం చింతలూరుకు చెందిన ఆదర్శరైతు నాగుల చిన్నగంగారాం (చిన్ని కృష్ణుడు) ఉన్నారు. సొంతగా అభివృద్ధి చేసిన 155 రకాల దేశీ వరి వంగడాలను ప్రదర్శనకు ఉంచారు. సమావేశానికి వచ్చిన రైతులు వరి విత్తనాలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం చి న్నికృష్ణుడు ప్రకృతి వ్యవసాయంపై సమావేశంలో ప్రసంగించారు.

‘బెట్టింగ్‌ చట్టరీత్యా నేరం’ 
1
1/2

‘బెట్టింగ్‌ చట్టరీత్యా నేరం’

‘బెట్టింగ్‌ చట్టరీత్యా నేరం’ 
2
2/2

‘బెట్టింగ్‌ చట్టరీత్యా నేరం’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement