
తెయూ విద్యార్థికి ‘సాహిత్య పురస్కారం’
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ తెలుగు అధ్యయన శాఖ విద్యార్థి రాజు సాహిత్య పురస్కారం అందుకున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆదివారం వెన్నెల సాహితీ సంగమం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనంలో రాజు పాల్గొన్నారు. తను రచించిన ఉగాది పండుగ కవితా రచనను సమ్మేళనంలో విన్పించగా వెన్నెల సాహితీ సంగమం ప్రతినిధులు, సాహితీప్రియులు, కవులు, రచయితలు రాజును ప్రత్యేకంగా అభినందించారు. కవితా రచనను ప్రోత్సహిస్తూ ‘సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య పురస్కారం’, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. పురస్కారాన్ని అందుకున్న రాజును తెయూ తెలుగు అధ్యయన శాఖ ప్రొఫెసర్ డీ కనకయ్య, అధ్యాపకులు అభినందించారు.
గుండె పోటుతో ఏవో విజయ్‌కుమార్ మృతి
ఎల్లారెడ్డి: స్థానిక ఆర్డీవో కార్యాలయం ఏవోగా బదిలీ అయిన విజయ్‌కుమార్ (59) ఆదివారం గుండె పోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవోగా విధులు నిర్వర్తించిన విజయ్‌కుమార్ ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయం ఏవోగా బదిలీ అయినట్లు వారు తెలిపారు. శనివారం బాన్సువాడ కార్యాలయం నుంచి రిలీవ్ కాగా సోమవారం ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో జాయిన్ కావాల్సి ఉంది. ఆదివారం ఉదయం గుండె పోటు రావడంతో మృతి చెందాడు. విజయ్‌కుమార్ మృతికి రెవెన్యూ అధికారులు సంతాపం వ్యక్తం చేశారు.

తెయూ విద్యార్థికి ‘సాహిత్య పురస్కారం’