ఎస్జీఎఫ్‌ స్క్వాష్‌ స్టేట్‌ మీట్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఎస్జీఎఫ్‌ స్క్వాష్‌ స్టేట్‌ మీట్‌ ప్రారంభం

Nov 21 2026 12:20 AM | Updated on Nov 21 2026 12:20 AM

నాగమల్లితోట జంక్షన్‌: స్థానిక డీఎస్‌ఏ గ్రౌండ్స్‌లో ఎస్జీఎఫ్‌యూ 14, 17, 19 బాల బాలికల స్క్వాష్‌ స్టేట్‌ మీట్‌ను కాకినాడ జిల్లా విద్యా శాఖాధికారి పిల్లి రమేష్‌ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 350 మంది క్రీడాకారులు హాజరయ్యారు. తొలుత డీఈఓ రమేష్‌ జాతీయ పతాకం ఆవిష్కరించారు. క్రీడాకారులకు వాకలపూడి జెడ్పీ హెచ్‌ఎస్‌లో వసతి చేసినట్టు స్కూల్‌ గేమ్స్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ పెద్దిశెట్టి శ్రీనివాస్‌ తెలిపారు. ఉప విద్యా శాఖధికారి కేవీవీ సత్యనారాయణ, రూరల్‌ ఎంఈఓ బి.శ్రీనివాస్‌ కుమార్‌, అర్బన్‌ ఎంఈఓ సీహెచ్‌ రవి, టోర్నమెంట్‌ అబ్జర్వర్‌ ఎన్‌.రామకృష్ణ, కాకినాడ ఎస్జీఎఫ్‌ అడ్మిన్‌ సెక్రటరీ వి.శేషుకుమారి, తూర్పుగోదావరి జిల్లా ఎస్జీఎఫ్‌ సెక్రటరీలు కె. శ్రీనివాస్‌, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement