ఉత్సాహంగా ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌ | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌

Nov 17 2026 12:20 AM | Updated on Nov 17 2026 12:20 AM

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఫెన్సింగ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో కాకినాడలో 13వ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సీనియర్‌ బాలుర, బాలికల ఫెన్సింగ్‌ చాంపియన్‌ షిప్‌ 2026–27 పోటీలు నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. స్థానిక లక్ష్య ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో నిర్వహించిన ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ వై.చైతన్య మురళి, ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్‌ ఎన్‌.శేషారెడ్డి, ఫెన్సింగ్‌ అసోసియేషన్‌ ఆంఽధ్రప్రదేశ్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌.సుగుణారెడ్డి హాజరయ్యారు. రిఫరర్‌గా రమకాంత్‌, మిశ్రా లోకేష్‌ (ఢిల్లీ) వ్యవహరించారు.

విజేతలు వీరే..

పురుషుల ఫాయిల్‌ విభాగంలో పశ్చిమగోదావరి బంగారు, తూర్పుగోదావరి రజత, ప్రకాశం, కర్నూలు కాంస్య పతకాలు సాధించాయి. మహిళల ఫాయిల్‌ విభాగంలో పశ్చిమగోదావరి బంగారు, తూర్పుగోదావరి రజత, విజయనగరం, గుంటూరు కాంస్య పతకాలు సాధించాయి. ఏపీ పురుషుల విభాగంలో కర్నూలు బంగారు, విశాఖ రజత, పశ్చిమగోదావరి, విజయనగరం కాంస్య పతకాలు గెలుచుకున్నాయి. ఏపీ మహిళల విభాగంలో కర్నూలు బంగారు, చిత్తూరు రజత, కృష్ణా, తూర్పుగోదావరి కాంస్య పతకాలు సాధించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement