రిమాండ్‌ ఖైదీ మృతి | - | Sakshi
Sakshi News home page

రిమాండ్‌ ఖైదీ మృతి

Nov 17 2026 12:20 AM | Updated on Nov 17 2026 12:20 AM

కాకినాడ క్రైం: తాళ్లరేవు మండలంలో ఇటీవల సంచలనం సృష్టించిన సంగాడి కామేష్‌వర్మ హత్య కేసులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న సంగాడి దుర్గా మల్లేశ్వరరావు (18) చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. కాకినాడ వనటౌన్‌ పోలీసులు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ పెదబొడ్డు వెంకటాయపాలేనికి చెందిన కామేష్‌వర్మ, పాలెపు సతీష్‌, పినపోతు కేశవ, దుర్గా మల్లేశ్వరరావు స్నేహితులు. గ్రామంలో జరిగిన నో దొంగతనం కేసులో వీరు నిందితులు. జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన వారిలో కామేష్‌వర్మ గత నెల 28 నుంచి కనిపించకుండా పోయి, సీతారామపురం ఇసుక ర్యాంపు సమీపాన ఆత్రేయ గోదావరిలో శవమై తేలాడు. అతడి మృతికి స్నేహితులే కారణమంటూ పలువురు వారిపై మూకుమ్మడి దాడి చేశారు. ఈ దాడిలో పాలెపు సతీష్‌, పినపోతు కేశవ తీవ్రంగా గాయపడి, కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో యువకుడు సంగాడి దుర్గామల్లేశ్వరరావు గ్రామస్తుల కళ్లుగప్పి పరారై, ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. కేసు దర్యాప్తులో భాగంగా కాకినాడ రూరల్‌ సీఐ చైతన్యకృష్ణ ఆధ్వర్యాన కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ ఈ నెల 14న మల్లేశ్వరరావును అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు. కాగా, అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement