పెయిడ్‌ ఎల్లో సైకోలు మూల్యం చెల్లించక తప్పదు | - | Sakshi
Sakshi News home page

పెయిడ్‌ ఎల్లో సైకోలు మూల్యం చెల్లించక తప్పదు

Nov 16 2026 12:02 AM | Updated on Nov 16 2026 12:02 AM

కాకినాడ రూరల్‌: వైఎస్సార్‌ సీపీఽ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులపై పచ్చ సైకోలు చేసిన వ్యాఖ్యలను సభ్య సమాజం ఖండిస్తుందని, దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించకపోవడం దురదృష్ణకరమని వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి అన్నారు. కాకినాడలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ అసభ్య పదజాలంతో దూషించిన వ్యక్తుల కుటుంబాల్లో మహిళలు లేరా అని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు కుటుంబ సభ్యులను దూషించారంటూ కన్నీరు పెట్టుకున్న ఆయనకు ఈ వ్యవహారం కనిపించదా అని నిలదీశారు. పవన్‌ కళ్యాణ్‌ వైవాహిక జీవితంలో తాజాగా జరిగిన పరిణామంపై జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో హుందాగా వ్యవహరించారని, వైఎస్సార్‌ సీపీ శ్రేణులు సంయమనం పాటించారన్నారు. ఇది రుచించని చంద్రబాబు ఎల్లో పెయిడ్‌ ఆర్టిస్టులను రంగంలోకి దింపి వారికి జనసేన ఫేక్‌ ఐడీలతో జగన్‌ ఫ్యామిలీని తిట్టించారని నాగమణి అన్నారు. రానున్న రోజుల్లో పెయిడ్‌ ఎల్లో సైకోలు మూల్యం చెల్లించక తప్పదన్నారు.

20న జిల్లా స్థాయి

బాలల సైన్స్‌ కాంగ్రెస్‌

అమలాపురం రూరల్‌: జిల్లాలో జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌– 2026 జిల్లా స్థాయి కార్యక్రమాన్ని 20న ఉదయం 9 గంటలకు అమలాపురం మండలం వన్నెచింతలపూడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు డీఈఓ ఎస్‌కే మహబూబ్‌ బాషా తెలిపారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ప్రాజెక్టు బృందాలు తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. రిజిస్ట్రేషన్‌ చేసుకోని పాఠశాలల విద్యార్థులు తమ సైన్స్‌ ప్రాజెక్టులను ప్రదర్శించేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

రత్నగిరిని దర్శించి.. తరించి

అన్నవరం: అన్నవరంలోని శ్రీవీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆదివారం భక్తజన కోలాహలం నెలకొంది. ఆలయాన్ని తెల్లవారుజాము మూడు గంటలకు తెరిచి స్వామివారి దర్శనాలకు అనుమతించడంతో పాటు వ్రతాలు ప్రారంభించారు. సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించగా, స్వామివారి వ్రతాలు 5,300 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్వామివారిని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. తూర్పు రాజగోపురం ముందు రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. కార్తిక తొలి సోమవారం కావడంతో సత్యదేవుని ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

శత సహస్రోత్సవాలు నిర్వహించుకోవాలి

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): రాజమహేంద్రవరంలోని గౌతమి వ్యాయామ కళాశాల శత సహస్ర ఉత్సవాలు నిర్వహించుకోవాలని మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. ఆదివారం స్థానిక కోటిపల్లి బస్టాండ్‌ సెంటర్‌లోని ఈ కళాశాల శతాబ్ది ఉత్సవాలు జరిగాయి. కళాశాల కార్యదర్శి అడ్డూరి వెంకటరమణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, టీడీపీ నేత యర్రా వేణుగోపాలరాయుడు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఉత్సవం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో నూరు వసంతాలు పూర్తిచేసుకున్న శ్రీగౌతమి వ్యాయామ కళాశాల పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. టీడీపీ నేత యర్రా వేణుగోపాలరాయుడు, ఏపీ పవర్‌లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు ఎం.ప్రభాకరరావు, మొఘల్‌ బిర్యాని అధినేత ఎండీ ఇస్మాయిల్‌ తాహిర్‌, బిగ్‌వింగ్‌ ఎండీ ఇమ్మణి బుల్లివెంకటరావు కళాశాల ప్రగతిని వివరించారు. శ్రీఅడ్డూరి నారాయణరావు మెమోరియల్‌ 3వ ఏపీ సౌత్‌ ఈస్ట్‌ కోస్ట్‌ ఓపెన్‌ డీడ్‌లిఫ్ట్‌ అండ్‌ బాడీ బిల్డింగ్‌ చాంపియన్‌షిప్స్‌, కేరళలో జనవరిలో జరిగే సౌత్‌ ఇండియా బాడీబిల్డింగ్‌ చాంపియన్‌షిప్‌ సెలక్షన్స్‌ ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement