తాడిపూడిలో టీడీపీకి షాక్‌ | - | Sakshi
Sakshi News home page

తాడిపూడిలో టీడీపీకి షాక్‌

Nov 16 2026 12:02 AM | Updated on Nov 16 2026 12:02 AM

రావులపాలెం/ ఆత్రేయపురం: ఆత్రేయపురం మండలం తాడిపూడి గ్రామంలో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, పాలనపై అసంతృప్తితో గుమ్మడి కళావతి, కులుకల వరప్రసాద్‌, మిరియాల హెప్సిబా, నందుకుల మేరీరత్నం, నందుకుల చందు తదితర టీడీపీకి చెందిన 25 కుటుంబాలు ఆ పార్టీని వీడి వైఎస్సార్‌ సీపీలో చేరాయి. ఈ కార్యక్రమం వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సమక్షంలో గోపాలపురం గ్రామంలో జగ్గిరెడ్డి స్వగృహం వద్ద ఆదివారం జరిగింది. పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి ఆయన సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌ సీపీకి ప్రజల్లో విశ్వాసం, జగన్‌ నాయకత్వంపై నమ్మకం రోజురోజుకూ పెరుగుతుందన్నారు. రెండున్నర కూటమి ప్రభుత్వ పాలనతో విసిగిపోయిన ప్రజలు వైఎస్సార్‌ సీపీ వైపు అడుగులు వేస్తున్నారని అన్నారు. గ్రామ స్థాయిలో పార్టీకి పెరుగుతున్న ఆదరణే ఈ చేరికలకు నిదర్శనమని అన్నారు. రాబోయే రోజుల్లో మరింత మంది వైఎస్సార్‌ సీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ చేరికలతో తాడిపూడి గ్రామంలో పార్టీ మరింత బలోపేతం అయ్యిందని పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

ఫ వైఎస్సార్‌ సీపీలోకి 25 కుటుంబాలు

ఫ జిల్లా అధ్యక్షుడు

జగ్గిరెడ్డి సమక్షంలో చేరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement