నేటి నుంచి నామినేషన్ల పర్వం | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి నామినేషన్ల పర్వం

Nov 15 2026 1:32 PM | Updated on Nov 15 2026 1:32 PM

● తొలి విడతలో

93 పంచాయతీలకు ఎన్నికలు

● 17 వరకు నామినేషన్ల

దాఖలుకు అవకాశం

బోట్‌ క్లబ్‌ (కాకినాడ సిటీ): పంచాయతీలకు ఎన్నికల కళ వచ్చింది.. ఎన్నికల సంగ్రామంలో భాగంగా ఆదివారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. జిల్లా వ్యాప్తంగా కాకినాడ రూరల్‌, కరప, తాళ్లరేవు, పెద్దాపురం, సామర్లకోట మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో తొలి విడత ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 93 గ్రామ పంచాయతీలకు, 1,064 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా పంచాయతీల్లో 1,098 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 15 నుంచి 17 సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. రెండు, మూడు పంచాయతీలకు కలిపి ఒక క్లస్టర్‌ ఏర్పాటు చేసి, నిర్దేశించిన కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలను దక్కించుకునేందుకు ఆశావహులు ఇప్పటికే తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు తమ మద్దతుదారులను బరిలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నారు. 18న నామినేషన్ల పరిశీలన, 19న నామినేషన్ల తిరస్కరణకు సంబంధించి అప్పీళ్లను స్వీకరణ ఉంటుంది. 21న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. తర్వాత బరిలో నిలిచే అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. ఈ నెల 26న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి, అదే రోజు ఫలితాలను ప్రకటించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

సైన్స్‌, టెక్నాలజీతో

సమస్యలకు పరిష్కారాలు

● డీఈవో వాసుదేవరావు

● ఘనంగా 32వ జాతీయ బాలల

విజ్ఞాన సదస్సు

● రాష్ట్ర స్థాయికి ఆరు ప్రాజెక్టుల ఎంపిక

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): విద్యార్థులు పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా తమ చుట్టూ ఉన్న స్థానిక సమస్యలను గుర్తించి, వాటికి సైన్స్‌ అండ్‌ టెక్నాలజీతో ఆచరణాత్మక పరిష్కారాలను కనుగొనాలని జిల్లా విద్యాశాఖాధికారి కంది వాసుదేవరావు అన్నారు. స్థానిక ఎస్‌కేవీటీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో 32వ జాతీయ బాలల విజ్ఞాన సదస్సు జిల్లా స్థాయి కార్యక్రమం జరిగింది. ఈ ఏడాది సుస్థిరత కోసం సైన్స్‌, ఆవిష్కరణలు అనే ప్రధాన ఇతివృత్తంతో నిర్వహించారు. దీనికి జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులు, గైడ్‌ టీచర్లు, ప్రధానోపాధ్యాయులు హాజరయ్యారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన డీఈవో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 129 మంది విద్యార్థులు ఈ సైన్స్‌ కాంగ్రెస్‌లో పాల్గొనేందుకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోగా, 81 ప్రాజెక్టులను ప్రదర్శించారన్నారు. పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, ఇంధన పొదుపు, నీటి సంరక్షణ, పోషకాహారం, వ్యవసాయం, ప్రకృతి వైపరీత్యాల ముందస్తు అంచనా వంటి విభిన్న అంశాలపై వినూత్న ప్రాజెక్టులను రూపొందించి ప్రదర్శించారన్నారు. వీటిలో ఆరు ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించాయి. విద్యార్థుల ప్రతిభకు మార్గదర్శకులుగా నిలిచిన ఉపాధ్యాయులను, ఎంపికై న విద్యార్థులను విద్యాశాఖాధికారులు అభినందించారు. కార్యక్రమంలో అర్బన్‌ ఎంఈవో ఎంవీఎం సుబ్రహ్మణ్యం, కొవ్వూరు డివిజన్‌ డీవైఈఓ అయ్యంకి దుర్గా తులసీదాస్‌, డీసీఈబీ కార్యదర్శి రమణారావు, హెచ్‌ఎం అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కోలా సత్యనారాయణ, జిల్లా సైన్స్‌ ఆఫీసర్‌ జీవీఎన్‌ఎస్‌ నెహ్రూ, జిల్లా సైనన్స్‌ కో ఆర్డినేటర్‌ కేఎస్‌ఆర్‌ ఆంజనేయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement