దారి చూపాలంటూ ఆందోళన | - | Sakshi
Sakshi News home page

దారి చూపాలంటూ ఆందోళన

Nov 15 2026 1:32 PM | Updated on Nov 15 2026 1:32 PM

కాజులూరు: గొల్లపాలెం వైఎస్సార్‌ నగర్‌ కాలనీకి వెళ్లేందుకు దారి చూపాలంటూ స్థానికులు శనివారం ఆందోళనకు దిగారు. దివంగత నేత వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గొల్లపాలెం ధనలక్ష్మీపేటను ఆనుకుని 320 ఇళ్ల స్థలాలు ఇచ్చి, గృహ రుణాలు మంజూరు చేశారు. ఈ కాలనీకి సరైన రహదారి లేక లబ్ధిదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల కాలనీని ఆనుకుని ఓ ప్రైవేటు లేఅవుట్‌ వేశారు. ఆ లేఅవుట్‌ మీదుగా కొంగోడు రోడ్డుకు వెళ్లే అవకాశం ఉంది. సదరు లేఅవుట్‌దారులు తమ సరిహద్దులో లేఅవుట్‌ చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసి, రహదారిని మూసివేశారు. దీనివల్ల ఇటీవల భారీ వర్షాలకు కాలనీ అంతా నీరు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన ప్రముఖ హైకోర్టు న్యాయవాది రెడ్డి అన్నవరం పది లారీల గ్రావెల్‌ సమకూర్చారు. కాలనీకి రోడ్డు లేకపోవడంతో స్థానికులు ఫెన్సింగ్‌ తొలగించి ప్రైవేట్‌ లేఅవుట్‌ మీదుగా గ్రావెల్‌ లారీలను తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీనిపై లేఅవుట్‌దారులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో స్థానికులు, లేఅవుట్‌ యజమానుల మధ్య వివాదం తలెత్తింది. పలువురు పెద్దలు కలుగజేసుకుని గ్రావెల్‌ను లోపలకు తరలించి, రెండు రోజుల్లో ఫెన్సింగ్‌ సరిచేస్తామని సర్థిచెప్పడంతో వివాదం తాత్కాలికంగా సర్ధుమణిగింది. అయితే లేఅవుట్‌ మీదుగా కాలనీకి శాశ్వత రహదారి ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement