అభ్యర్థులకు అగచాట్లు | - | Sakshi
Sakshi News home page

అభ్యర్థులకు అగచాట్లు

Nov 15 2026 1:32 PM | Updated on Nov 15 2026 1:32 PM

● రూ.20 స్టాంప్‌ పేపర్లు లేక ఇబ్బందులు

● సర్వర్‌ మొరాయింపుతో సమస్యలు

కాకినాడ లీగల్‌: కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంప్‌ పేపర్లు లభించక ఇబ్బంది ఎదురవుతోంది. వీటిని విక్రయించడానికి సర్వర్‌ పనిచేయకపోవడం అవస్థలు తెచ్చిపెడుతుంది. ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థులు రూ.20 విలువైన నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంప్‌ పేపర్‌పై అఫిడవిట్‌ సమర్పించాల్సి ఉండగా, స్టాంపుల విక్రయాలకు సర్వర్‌ సమస్య ఆటంకంగా మారింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఆన్‌లైన్‌ సేవలు నిలిచిపోయాయి. నగరపాలక సంస్థ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభమైంది. అఫిడవిట్‌ కోసం రూ.20 నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంప్‌ పేపర్‌ తప్పనిసరిగా సమర్పించాలని రిటర్నింగ్‌ అధికారులు చెబుతున్నట్లు అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో స్టాంప్‌ పేపర్లు అందుబాటులో లేక నామినేషన్‌ పత్రాలు సిద్ధం చేసుకునే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్టాంప్‌ వెండర్ల వద్దకు వెళ్లినా పేపర్లు లభించక ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. వెంటనే జిల్లా రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు స్పందించి సర్వర్‌ సమస్యను పరిష్కరించాలని అభ్యర్థులు కోరుతున్నారు.

గ్రంథాలయాలు..

విజ్ఞాన దేవాలయాలు

అమలాపురం టౌన్‌: గ్రంథాలయాలు విజ్ఞానాన్ని అందించే దేవాలయాలని డీఈఓ డాక్టర్‌ ఎస్‌కే మెహబూబ్‌ బాషా అన్నారు. అమలాపురం ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథౠలయ వారోత్సవాలు, బాలల దినోత్సవాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. అనంతరం గ్రంథాలయాధికారి జీవీఆర్‌స్‌హెచ్‌కే వర్మ అధ్యక్షతన సభ జరిగింది. తొలుత సరస్వతీదేవి, పండిట్‌ జవహర్‌ నెహ్రూ చిత్రపటాలకు పూల మాలలు వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement