నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతోందని జిల్లా విద్యాశాఖ అధికారి పి.రమేష్ తెలిపారు. శనివారం కాకినాడలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 5కే రన్ నిర్వహించారు. దీనిని డీఈఓ రమేష్, అంతర్జాతీయ హాకీ క్రీడాకారుడు, ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారి దాసరి మురళీకృష్ణ, చావలి రవినారాయణ ప్రారంభించారు. ఇందులో పాల్గొన్న క్రీడాకారులకు టీషర్టు, షర్టిఫికెట్లు అందజేశారు. విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. పీడీలు నాగు, శ్రీనివాస్, ప్రసాద్‌రెడ్డి, టివీఎస్ రంగారావు, బంగార్రాజు, సూరిబాబు, గోవిందు, వాసు, పట్టాభి తదితరులు సహకారం అందించారు. ముందుగా జిల్లాలో మరణించిన పీడీలు డాక్టర్ కె.స్పర్జన్‌రాజు, పీఆర్ డిగ్రీ కళాశాల పీడీ వర్మ, అథ్లెటిక్స్ సంఘ మాజీ కార్యదర్శి చంద్ర చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు.
రన్‌లో పాల్గొన్న క్రీడాకారులు


