క్రీడా సమాచారం | - | Sakshi
Sakshi News home page

క్రీడా సమాచారం

Nov 15 2026 1:32 PM | Updated on Nov 15 2026 1:32 PM

జాతీయ సాఫ్ట్‌ బాల్‌ జట్టుకు రామలక్ష్మి

ఐ.పోలవరం: పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగిలో ఇటీవల నిర్వహించిన అండర్‌ – 19 సాఫ్ట్‌ బాల్‌ రాష్ట్ర స్థాయి పోటీల్లో లలో తూర్పుగోదావరి జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన జి.వేమవరానికి చెందిన గండుపల్లి రామలక్ష్మి ఎంపికై ంది. స్థానిక ఉన్నత పాఠశాలలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతున్న ఆ బాలిక.. ఈ నెల 18 నుంచి 24 వరకు పంజాబ్‌లోని చంఢీగఢ్‌లో జరిగే జాతీయస్థాయి అండర్‌–19 పోటీల్లో పాల్గొంటుందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మట్టపర్తి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆ బాలికను పలువురు అభినందించారు.

ఫెన్సింగ్‌ క్రీడాకారుల

ఎంపికలు

నాగమల్లితోట జంక్షన్‌(కాకినాడ సిటీ): జిల్లా ఫెన్సింగ్‌ సంఘం ఆధ్వర్యంలో సీనియర్స్‌ విభాగంలో క్రీడాకారుల ఎంపికలు నిర్వహించినట్లు కార్యదర్శి సింహాద్రి శనివారం తెలిపారు. కాకినాడలోని కన్నయ్య కాపు నగరంలోని జీఏ కమ్యూనిటీ హాల్లో జరిగిన ఈ ఎంపికల్లో 13 ఏళ్లు పైబడిన క్రీడాకారులు పాల్గొని ప్రతిభ కనబరిచారన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికై న వారు ఆదివారం లక్ష్య స్కూల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. రాష్ట్రస్థాయిలో ఎంపికై న వారు ఈ నెల 27న పంజాబ్‌లోని గురునానక్‌ యూనివర్శిటీలో జరిగే జాతీయ పోటీలకు అర్హత సాధిస్తారని తెలిపారు.

ఎస్‌జీఎఫ్‌ఐ ఎంపికలు

నాగమల్లితోట జంక్షన్‌(కాకినాడ సిటీ): జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య అండర్‌–14, 17 ఆధ్వర్యంలో కాకినాడ డీఎస్‌ఏ మైదానంలో శనివారం ఎంపికలు జరిగాయి. వీటిని జిల్లా ఎస్‌జీఎఫ్‌ఐ కార్యదర్శి పి.శ్రీనివాస్‌ ప్రారంభించారు. అండర్‌–14, 17 ఆర్చరీ, కలియపట్టులో బాల బాలికలను ఎంపిక చేశారు. ఎన్టీఆర్‌ బీచ్‌లో బీచ్‌ వాలీబాల్‌లో ఎంపికలు జరిగాయి. రాజమహేంద్రవరంలో అథ్లెటిక్స్‌లో ఎంపికలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 1200 మంది ఈ ఎంపికల్లో పాల్గొన్నారని శ్రీనివాస్‌ తెలిపారు. ఎంపికల నిర్వహణలో పీడీలు రవిరాజు, మాచరరావు, ఆర్చరీ కోచ్‌ లక్ష్మణరావు, జార్జి, నాగలింగేశ్వరరావు, మురళీకుమార్‌, వెంకటేశ్వర్లు, శ్రీహరిరాజు పాల్గొన్నారు.

యానాంలో అథ్లెటిక్స్‌ పోటీలు ప్రారంభం

యానాం: కౌన్సిల్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌, ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో అండర్‌ – 25 బాలురు, బాలికల ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ కబడ్డీ, వాలీబాల్‌, కోకో, బ్యాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ శనివారం యానాంలోని బాలయోగి క్రీడా మైదానంలో ప్రారంభమైంది. వీటికి ఆంధ్రప్రదేశ్‌లోని 11 జిల్లాల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు హాజరయ్యారు. వారందరికీ స్థానిక మంత్రి మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో భోజన వసతి ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement