‘కూటమి’ని ఓడించాలి | - | Sakshi
Sakshi News home page

‘కూటమి’ని ఓడించాలి

Nov 14 2026 12:53 AM | Updated on Nov 14 2026 12:53 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నా పట్టించుకోని కూటమి ప్రభుత్వాన్ని కాకినాడ నగర పాలక సంస్థల ఎన్నికల్లో ఓడించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తాటిపాక మధు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఆ పార్టీ జిల్లా సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న, ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం చూపుతున్న కూటమిని కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూకటివేళ్లతో పెకలించాలని నగర ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రజా సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకొని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని కోరారు. పెరుగుతున్న నిత్యావసర ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ధరల నియంత్రణకు ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో అవినీతి, అధికార దుర్వినియోగం జరుగుతున్నాయని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం విచ్చలవిడిగా డబ్బు వెదజల్లుతూ పోలీసుల ప్రమేయంతో స్థానిక ఎన్నికలు నిర్వహించిందని అన్నారు. రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామిక హక్కులు, స్వతంత్ర సంస్థల స్వయంప్రతిపత్తి, పౌర హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించే ఏ విధానాన్నైనా ప్రజాస్వామ్య పద్ధతుల్లో వ్యతిరేకించాలని, రాజ్యాంగ విలువలను కాపాడటంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మధు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు రామకృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement