గోకవరం: టీడీపీకి గోకవరం మండలంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ గ్రామ మాజీ సర్పంచ్ బత్తుల శ్రీలక్ష్మీ సత్తిబాబు టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరారు. వారితో పాటు మరో 60 కుటుంబాలకు చెందిన 185 మంది కూడా వైఎస్సార్ సీపీలో చేరారు. వారందరికీ వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తోట శ్రీరాంజీ కండువాలు వేసి, సాదరంగా ఆహ్వానించారు. బత్తుల సత్తిబాబు మాట్లాడుతూ, పేదల సంక్షేమమే లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అద్భుత పాలన అందించారన్నారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జగ్గంపేట కో ఆర్డినేటర్ తోట నరసింహం, శ్రీరాంజీతో కలిసి పార్టీ బలోపేతానికి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు పాటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


