కర్పూరం.. అపురూపం.. | - | Sakshi
Sakshi News home page

కర్పూరం.. అపురూపం..

Nov 14 2026 12:53 AM | Updated on Nov 14 2026 12:53 AM

కొత్తపేట: స్థానిక కమ్మిరెడ్డిపాలెం ప్రాంతానికి చెందిన పురోహితుడు పెద్దింటి రామచంద్ర శ్రీహరి (రామం) ఇంట కర్పూరం మొక్క ఆకట్టుకుంటోంది. అరుదైన మొక్కలను సేకరించే హాబీ ఉన్న ఆయన తాజాగా కర్పూరం మొక్కను సేకరించారు. ఈ మేరకు శుక్రవారం కొత్తపేటలో విలేకరులకు ఈ మొక్క వివరాలు వెల్లడించారు. కడియపులంక సత్యదేవ నర్సరీ వారు తనకున్న అరుదైన మొక్కల సేకరణపై ఆసక్తిని గమనించి, నర్సరీకి వచ్చిన అరుదైన మొక్కలు ఇస్తుంటారన్నారు. దానిలో భాగంగా ఈ కర్పూరం మొక్కను బహూకరించారని తెలిపారు. మనం నిత్యం పూజలో వెలిగించే హారతి కర్పూరం, ప్రసాదాల్లో వాడే పచ్చ కర్పూరం ఈ మొక్క నుంచే తయారు చేస్తారన్నారు. ఈ మొక్క ఆకులు, బెరడు తీసి వాటిని కుండలో వేసి, నీరు పోసి ఉడికించగా వచ్చే ఆవిరిని పళ్లెంలోకి పడతారని, ఆ నీరు చల్లారిన తర్వాత గడ్డ కట్టి కర్పూరంగా తయారవుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement