‘భయా’బెటిస్‌ | - | Sakshi
Sakshi News home page

‘భయా’బెటిస్‌

Nov 14 2026 12:53 AM | Updated on Nov 14 2026 12:53 AM

ప్రధాన లక్షణాలు

మధుమేహం ప్రారంభ దశలో స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు క్రింది లక్షణాలు సాధారణంగా గమనించవచ్చు

ఫ ఎక్కువగా దాహం వేయడం

ఫ తరచుగా మూత్ర విసర్జన.

ఫ అధిక ఆకలి, అలసట

ఫ వేగంగా బరువు తగ్గడం

ఫ కంటి చూపు మందగించడం

ఫ గాయాలు త్వరగా నయం

కాకపోవడం

ఫ చేతులు, కాళ్లలో తిమ్మిర్లు రావడం.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఫ మధుమేహ వ్యాధిగ్రస్తులు క్రమం

తప్పకుండా చికిత్స తీసుకోవాలి

ఫ ఆహార నియమాలను పాటిస్తూ,

తగిన ఔషధాలను వాడాలి.

ఫ ప్రతి రోజూ 45 నిమిషాల పాటు

వ్యాయామం చేయాలి.

ఫ విస్తరిస్తున్న డయాబెటిస్‌

ఫ నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాపాయం

ఫ గుండె, మెదడు పోటుకు దారి తీసే అవకాశం

ఫ నేడు ప్రపంచ మధుమేహ దినోత్సవం

ఆలమూరు: ఆధునిక కాలంలో డయాబెటిస్‌ (మధుమేహం) వ్యాధి తీవ్రంగా భయపెడుతోంది. సాధా రణ భాషలో షుగర్‌గా పిలుచుకునే ఈ వ్యాధి వయసుతో సంబంధం లేకుండా అందరికీ వస్తోంది. ఆహా ర అలవాట్లలో సంభవిస్తున్న మార్పులు, పని ఒత్తిడి, మానసిక సంఘర్షణ వల్ల అనేక మంది శరీరంలో మధుమేహం నియంత్రణలో ఉండటం లేదు. ఈ వ్యాధి సోకిన వారి శరీరంలో గ్లూకోజ్‌ (చక్కెర) స్ధాయి లను నియంత్రించే విధానానికి ఆటంకం ఏర్పడుతుంది. తద్వారా శరీరంలోని రక్తంలో ఇన్సులిన్‌ ఉత్పత్తి తగ్గిపోయి, అనేక ఇతర అనారోగ్య సమస్యలు సంభవించే అవకాశం ఉంది. ముఖ్యంగా గుండెపోటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌ (పక్షవాతం) రావడంతో పాటు కిడ్నీలు, పాదాలు, కంటి రెటీనా సైతం దెబ్బతింటుంది. కొంతమంది పదిహేనేళ్ల వయసులోనే ప్రీ డయాబెటిక్‌ స్టేజ్‌కు చేరుకుంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

సైలెంట్‌ కిల్లర్‌ : మధుమేహం వ్యాధిని నియంత్రించుకోవడంపై తప్ప సరియైన పూర్తి స్థాయి చికిత్స ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రముఖ కెనడా శాస్త్రవ్తేత సర్‌ ఫెడరిక్‌ బ్రాంటింగ్‌ తన సహచరులైన చార్లెస్‌ బెస్ట్‌, జేమ్స్‌ కొల్లిప్‌తో కలిసి 1921లో మధుమేహ నియంత్రణకు వినియోగించే ఇన్సులిన్‌ ఇంజక్షన్‌ను కనుగొన్నారు. అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య (ఐడీఎఫ్‌). ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు 2006లో శాస్త్రవేత్త బ్రాంటింగ్‌ జయంతి రోజైన నవంబర్‌ 14న మధుమేహ దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.

చికిత్స తీసుకోవాలి

మధుమేహ వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా చికిత్సను తీసుకోవాలి. వైద్యుల పర్యవేక్షణలో ఔషధాలను వాడాలి. ఆహార నియమాలను సక్రమంగా పాటించడం, వ్యాయామం ద్వారా వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు.

– ఎం.సుమలత, జిల్లా నోడల్‌ అధికారి, ఆర్‌బీఎస్‌కే, అమలాపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement