జాతీయ బాక్సింగ్‌ పోటీలకు 23 మంది ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయ బాక్సింగ్‌ పోటీలకు 23 మంది ఎంపిక

Nov 14 2026 12:53 AM | Updated on Nov 14 2026 12:53 AM

పిఠాపురం: జాతీయ స్థాయి బాక్సింగ్‌ పోటీలకు 23 మంది ఎంపికయ్యారని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్కూల్‌ గేమ్స్‌ సెక్రటరీ వెంకటరెడ్డి, పీడీ రామారావు తెలిపారు. పిఠాపురం ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వేదికగా ఈ నెల 11 నుంచి 13 వరకు 70వ రాష్ట్రస్థాయి స్కూల్‌ గేమ్స్‌ అండర్‌–19 బాల బాలికల బాక్సింగ్‌ పోటీలు నిర్వహించారు. వీటికి రాష్ట్ర నలుమూలల సుమారు 230 మంది బాక్సర్లు తరలివచ్చారు. ఈ పోటీల్లో ఓవరాల్‌ చాంపియన్‌గా విశాఖపట్నం నిలిచింది. హోరాహోరీగా సాగిన ఈ టోర్నమెంట్‌లో 11 మంది బాలురు, 12 మంది బాలికలు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరందరూ త్వరలో హర్యానాలో జరగనున్న జాతీయ స్కూల్‌ గేమ్స్‌ అండర్‌–19 బాక్సింగ్‌ పోటీల్లో రాష్ట్రం తరఫున బరిలోకి దిగనున్నట్లు నిర్వహణ కార్యదర్శి పి.లక్ష్మణరావు తెలిపారు. కాకినాడ జిల్లా బాక్సింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఇమ్మిడిశెట్టి నాగేంద్ర కుమార్‌, పోటీల అబ్జర్వర్‌ అప్పలరాజు, పిఠాపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డీఆర్‌కే రెడ్డి, ప్రఖ్యాత ద్రోణాచార్య అవార్డు గ్రహీత వెంకటేశ్వరరావు, కాకినాడ జిల్లా స్కూల్‌ గేమ్స్‌ అండర్‌–17 సెక్రటరీ పి.శ్రీనివాస్‌, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల ప్రధాన కార్యదర్శి మాచారావు, మాజీ స్కూల్‌ గేమ్స్‌ సెక్రటరీ లంక జార్జి, యన్‌.మహేంద్రన్‌ తదితరులు విజేతలను అభినందించి బహుమతులు ప్రదానం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement