మందుబాబులపై.. బాదుడే బాదుడు | - | Sakshi
Sakshi News home page

మందుబాబులపై.. బాదుడే బాదుడు

Nov 12 2026 12:19 AM | Updated on Nov 12 2026 12:19 AM

సాక్షి ప్రతినిధి, కాకినాడ: మద్యం సిండికేట్‌ బరితెగిస్తోంది. తమను ఆపేవాడెవడంటూ రెచ్చిపోతోంది. మందుబాబుల బలహీనతను అవకాశంగా తీసుకుని మద్యం ధరలను ఇష్టానుసారం పెంచేస్తోంది. గరిష్ట చి ల్లర ధర(ఎంఆర్‌పీ)కు అదనంగా ప్రతి బాటిల్‌పై రూ. 10 నుంచి రూ.30 వరకూ బాదేస్తోంది. బహిరంగంగానే ఈ దోపిడీ జరుగుతున్నా అడ్డుకుంటున్న నాథుడే కరువయ్యాడు. ఎవరైనా గట్టిగా నిలదీస్తే తమకు సవాలక్ష కారణాలున్నాయని, పర్మిట్‌ రూముల కోసం ప్ర భుత్వానికి, ఎకై ్సజ్‌ అధికారులకు నెలవారీ మామూళ్లు ఇవ్వాలని చెబుతున్నట్లు ఆరోపణలున్నాయి.

బాదేస్తున్నారిలా..

జిల్లావ్యాప్తంగా 170 మద్యం షాపులున్నాయి. అత్యధికంగా కాకినాడ సిటీ, రూరల్‌ పరిధిలో 38 షాపులు నడుస్తున్నాయి. వీటికి సామర్లకోట ఐఎంఎల్‌ డిపో నుంచి మద్యం సరఫరా చేస్తున్నారు. ప్రధానంగా కాకినాడ సిటీ, రూరల్‌ పరిధిలోని మద్యం సిండికేట్‌ దోపిడీకి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ప్రతి క్వార్టర్‌ బాటిల్‌పై అనధికారికంగా రూ.10 నుంచి రూ.20 వరకూ అదనంగా వసూలు చేస్తోంది. రాత్రయితే ఏకంగా రూ.30 వరకూ దండుకుంటున్నారు. ఇది చాలదన్నట్లు జిల్లావ్యాప్తంగా ఒక్కో మద్యం దుకాణానికి అనుబంధంగా కనీసం మూడు నుంచి ఐదు చొప్పున బెల్టు షాపులు ఏర్పాటు చేశారు. ఈవిధంగా జిల్లాలో 600కు పైగా బెల్ట్‌ షాపులున్నట్లు సమాచారం. వీటి ద్వారా అమ్మే మద్యంపై గతంలో ఎంఆర్‌పీ కంటే అదనంగా రూ.30 నుంచి రూ.50 వరకూ వసూలు చేసేవారు. ప్రస్తుతం బాటిల్‌పై ధర రూ.10 పెరగడంతో బెల్టు షాపుల్లో ఏకంగా రూ.50 నుంచి రూ.60 వరకూ అదనంగా బాదేస్తున్నారు. వెరసి రూ.190 ఉన్న క్వార్టర్‌ బాటిల్‌ను ఏకంగా రూ.240కి కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ప్రతి గ్రామంలో నాలుగేసి బెల్టుషాపులు ఏర్పాటు చేయడం ద్వారా మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. తద్వారా మందుబాబుల జేబులు గుల్ల చేస్తూ రూ.లక్షల్లో అక్రమంగా ఆర్జిస్తున్నారు.

కాకినాడలో బరితెగిస్తున్న

మద్యం సిండికేట్‌

క్వార్టర్‌ బాటిల్‌పై రూ.10 నుంచి

రూ.30 వరకూ అదనపు వసూళ్లు

స్పందించని ఎకై ్సజ్‌ అధికారులు

మామూళ్ల మత్తులోనే

పట్టించుకోవడం లేదని విమర్శలు

ప్రజాప్రతినిధులకూ వాటాలు

ఇస్తున్నట్లు ఆరోపణలు

స్థానిక ఎన్నికల వేళ విచ్చలవిడిగా విక్రయాలు

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అధికార కూటమికి చెందిన మద్యం వ్యాపారులకే షాపులను తిరిగి కట్టబెట్టింది. ఇదే అదునుగా మద్యం సిండికేట్‌ చెలరేగిపోయింది. జిల్లావ్యాప్తంగా రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ మద్యం విక్రయించారు. ఎన్నికల సమయంలో మద్యం విక్రయాలను నిషేధించినప్పటికీ కాకినాడ సిటీ, రూరల్‌ నియోజకవర్గాల్లో గుట్టు చప్పుడు కాకుండా మద్యం ధరలు విపరీతంగా పెంచి రూ.లక్షల్లో కొల్లగొట్టారు. అర్ధరాత్రి అయినా సరే మద్యం లభించేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా మూడుసార్లు మద్యం ధరలు పెంచగా.. అధికార కూటమికి చెందిన మద్యం సిండికేట్‌ అనధికారికంగా అనేకసార్లు రేట్లు పెంచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement