గాలాడక.. గాఢాంధకారం పోక | - | Sakshi
Sakshi News home page

గాలాడక.. గాఢాంధకారం పోక

Nov 7 2026 12:12 AM | Updated on Nov 7 2026 12:12 AM

మామిడికుదురు: గాఢాంధకారంలో మగ్గుతున్నాం.. గాలాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం.. దోమల రోత ఆపై చీకటితో అల్లాడుతున్నాం.. ఎన్నాళ్లీ చీకటి రోజులంటూ పాశర్లపూడిలంక గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తుపాను కారణంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి పది రోజులు గడుస్తున్నా, అధికారులు ఇప్పటి వరకు సరఫరా పునరుద్ధరణ చర్యలు చేపట్టకపోవడంపై వారు గురువారం రాత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కొవ్వొత్తులు పట్టుకుని వీధుల్లోకి వచ్చి తమ ఆవేదనను వెళ్లగక్కారు. పది రోజులుగా చీకట్లోనే కాలం వెళ్లదీస్తున్నామని, కరెంట్‌ లేక రాత్రి వేళల్లో నరకం చూస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో మోటార్లు పనిచేయక తాగునీటికి, నిత్యావసర పనులకు తీవ్ర అంతరాయం కలుగుతోందని వాపోయారు. ఉక్కబోత, దోమకాట్లతో చిన్నపిల్లలు, వృద్ధులు అల్లాడిపోతున్నారని, పది రోజుల నుంచి తమకు నిద్ర కరవైందని కన్నీరుమున్నీరయ్యారు. మరోవైపు గ్రామాల్లో కరెంట్‌ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు కొవ్వొత్తుల ధరలను విపరీతంగా పెంచేశారని బాధితులు ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement