జాతీయ ఫుట్‌బాల్‌ పోటీలకు జగ్బంధ్‌ | - | Sakshi
Sakshi News home page

జాతీయ ఫుట్‌బాల్‌ పోటీలకు జగ్బంధ్‌

Nov 5 2026 12:10 AM | Updated on Nov 5 2026 12:10 AM

అడ్డతీగల: వేటమామిడి బేస్‌ స్కూల్‌ విద్యార్థి గొల్లోరి జగ్బంధ్‌ అండర్‌–14 విభాగంలో రాష్ట్ర ఫుట్‌బాల్‌ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ నెలలో జరగనున్న జాతీయ స్థాయి ఫుట్‌బాల్‌ పోటీల్లో రాష్ట్రం తరఫున ఆడనున్నారు. ఇప్పటికే బేస్‌ స్కూల్‌కు చెందిన పలువురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు ఎంపికై ప్రతిభను చాటారు. అండర్‌–17 బాలుర విభాగంలో వరుణ్‌ విన్సెంట్‌, చెదల విజయ రాష్ట్ర స్థాయికి ఎంపిక కాగా, అండర్‌–14 బాలికల విభాగంలో బిర్మో ఎస్తేరు ఎంపికై ంది. బేస్‌ స్కూల్లో విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యమిస్తూ విద్యార్థుల శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తున్నామని ప్రిన్సిపాల్‌ మృదుహాసిని తెలిపారు.

ఫ్లషింగ్‌ ఆపరేషన్‌

విజయవంతం

ధవళేశ్వరం: వరదల సీజన్‌ అనంతరం నిర్వహించే ఫ్లషింగ్‌ ఆపరేషన్‌ను బుధవారం ధవళేశ్వరం తూర్పు డెల్టా స్కవర్‌ స్లూయిజ్‌ వద్ద విజయవంతంగా నిర్వహించారు. ఇరిగేషన్‌ డీఈ కె.ఆనందబాబు ఉదయం గేట్ల స్విచ్ఛాన్‌ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒకేసారి స్కవర్‌ స్లూయిజ్‌ గేట్ల ద్వారా నీటిని విడుదల చేయడంతో గేట్ల వద్ద పేరుకుపోయిన మట్టి దిగువకు కొట్టుకుపోయింది. బుధవారం 11,530 క్యూసెక్కుల నీటిని ఫ్లషింగ్‌ ఆపరేషన్‌ ద్వారా దిగువకు విడుదల చేశారు. డీఈ ఆనందబాబు మాట్లాడుతూ రబీ సాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా ఫ్లషింగ్‌ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే పశ్చిమ, మధ్య డెల్టా స్కవర్‌ స్లూయిజ్‌ల వద్ద నిర్వహించామని, ఇప్పుడు తూర్పు డెల్టా స్కవర్‌ స్లూయిజ్‌ వద్ద నిర్వహించిన ఆపరేషన్‌తో ఈ ప్రక్రియ పూర్తయ్యిందన్నారు.

గజ వాహనంపై శ్రీవారు

ఆత్రేయపురం: వాడపల్లిలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామివారిని రాజాధిరాజ అలంకరణతో గజవాహనంపై ఊరేగించారు. మేళ తాళాలు, బ్యాండ్‌ వాయిద్యాలు, బాణసంచా కాల్పుల ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది. బ్రహ్మోత్సవాల పూజలు, కై ంకర్యాలలో దేవదాయశాఖ ఉప కమిషనర్‌ నల్లం సూర్య చక్రధరరావు దంపతులు పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

డ్రైనేజీలో చిక్కుకున్న ఆవు

కాట్రేనికోన: మండల కేంద్రమైన కాట్రేనికోనలో బుధవారం ఓ ఆవు డ్రైనేజీలో పడిపోయింది. సుమారు రెండు గంటల పాటు నరకయాతన అనుభవించింది. దీంతో కొందరు యువకులు సంఘటన స్థలానికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టారు. వంగా దుర్గ బాబు ఆధ్వర్యంలో ఆవును డ్రైనేజీ నుండి బయటకు తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement