కిర్లంపూడి: మండలంలోని కొక్కొండ రామ శేషగిరి పంతులు ప్రభుత్వోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 55, 56, 57 పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ బుధవారం పరిశీలించారు. తొలుత స్థానిక సత్యదేవ కల్యాణ మండపంలో జరుగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఆయన పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ప్రియ కూడా పాల్గొన్నారు.
నేడు కార్మికులకు
వేతనంతో కూడిన సెలవు
అమలాపురం రూరల్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరిగే ప్రాంతాల్లో పని చేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు గురువారం వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కంపెనీలు, దుకాణాలు, వాణిజ్య సంస్థల్లో పని చేసే ఉద్యోగులు, కార్మికులకు ఈ సెలవు వర్తిస్తుందన్నారు.
నేడు స్థానిక సెలవు
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరిగే ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు, బ్యాంకులకు గురువారం స్థానిక సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లు సజావుగా కొనసాగించడంతో పాటు ఈ విధుల్లో పాల్గొనే సిబ్బందికి, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చూడటమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.


