కిర్లంపూడి: వైఎస్సార్ సీపీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్తా శక్తివంచన లేకుండా పని చేయాలని మాజీ మంత్రి, ఆ పార్టీ జగ్గంపేట కో ఆర్డినేటర్ తోట నరసింహం అన్నారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కరటూరి శ్రీనివాస్ ఆధ్వర్యాన జగ్గంపేట మండలం నగరం గ్రామానికి చెందిన యువత కిర్లంపూడి మండలం వీరవరంలో సోమవారం వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి నరసింహం పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో యువత కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ తోట శ్రీరాంజీ తదితరులు పాల్గొన్నారు.


