29 నుంచి వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

29 నుంచి వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు

Oct 27 2026 12:15 AM | Updated on Oct 27 2026 12:15 AM

ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వరస్వామివారి 14వ వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ నెల 29 నుంచి నవంబర్‌ 6 వరకు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవదాయ శాఖ ఉప కమిషనర్‌, ఆలయ ఈవో నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. ఆయన సోమవారం మాట్లాడుతూ ఈ మేరకు స్వామివారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను పంపిణీ చేస్తున్నామన్నారు. 29న ఉత్సవాలకు శ్రీకారం చుట్టి, రాత్రి శేష వాహనసేవతో ప్రారంభిస్తామన్నారు. ఆ సందర్భంగా ఈ నెల 29 నుంచి నవంబర్‌ 6వ తేదీ వరకు ఆలయంలో ఆర్జిత సేవలు, సామూహిక అష్టోత్తర పూజలు, ఐశ్వర్య లక్ష్మీ హోమాలు, కల్యాణాలు రద్దు చేసినట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement