ప్రతిభ చూపి.. ౖపైపెకి ఎగసి.. | - | Sakshi
Sakshi News home page

ప్రతిభ చూపి.. ౖపైపెకి ఎగసి..

Oct 27 2026 12:15 AM | Updated on Oct 27 2026 12:15 AM

ఫ క్రీడల్లో సత్తా చాటిన విద్యార్థులు

ఫ జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

కాజులూరు: ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో సత్తా చాటుతున్నారు. పోటీల్లో ప్రతిభ చూపుతూ జాతీయ స్థాయి క్రీడాకారులుగా తయారవుతున్నారు. ఈ క్రమంలో కాజులూరు జిల్లా పరిషత్‌ పాఠశాలకు చెందిన మమతశ్రీ, కుసుమదుర్గ, లహరి, నరసింహ నాయుడు జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికరయ్యారు. ఆ పాఠశాలలో సోమవారం హెచ్‌ఎం మార్ని విషు్‌ూణ్మర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభలో వ్యాయామ ఉపాధ్యాయులు గరగ నాగమణిదేవి, కె.గౌతమి సుధ, బి.మణికంఠ మాట్లాడుతూ ఇటీవల బాపట్లలో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ మీట్‌లో తమ విద్యార్థులు ప్రతిభ చూపారన్నారు. త్వరలో హైదరాబాద్‌లో జరిగే జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలలో రాష్ట్ర జట్టు తరఫున పోటీపడతారన్నారు.

మరో ఇద్దరు..

పి.గన్నవరం: ఏపీ అథ్లెటిక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం రావులపాలెంలో నిర్వహించిన జిల్లా స్థాయి జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో పి.గన్నవరం పీఎంశ్రీ జెడ్పీ హైస్కూల్‌కు చెందిన ఇద్దరు 9వ తరగతి విద్యార్థులు అండర్‌–14 విభాగంలో ప్రథమ స్థానాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని హెచ్‌ఎం కె.ఉమాదేవి సోమవారం తెలిపారు. తమ విద్యార్థులైన మెర్ల సాయిదుర్గ గోపాల స్వామి, గెద్దాడ సంతోష్‌ 60, 600 మీటర్ల రన్నింగ్‌, హైజంప్‌, లాంగ్‌ జంప్‌ పోటీల్లో ప్రథమ స్థానం సాధించారన్నారు. దీంతో వీరిద్దరూ నవంబర్‌ 14 నుంచి 16 వరకు హైదరాబాద్‌లో జరిగే 20 వ జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో జిల్లా తరపున పాల్గొంటారన్నారు.

సెపక్‌ తక్రా క్రీడాకారులకు అభినందనలు

అమలాపురం రూరల్‌: మధ్యప్రదేశ్‌లో ఈ నెల 30వ తేదీ నుంచి నవంబర్‌ 3వ తేదీ వరకు జరిగే 36వ సీనియర్‌ నేషనల్‌ సెపక్‌ తక్రా పురుషులు, మహిళల పోటీలకు రాష్ట్రం తరఫున ఎంపికై న క్రీడాకారులకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌ అభినందనలు తెలిపారు. సోమవారం కోనసీమ జిల్లా క్రీడా సంస్థ ఆధ్వర్యంలో అమలాపురంలోని బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో రాష్ట్ర జట్టుకు ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో మాట్లాడారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రుద్ర వైకుంఠ రావు మాట్లాడుతూ జాతీయస్థాయి పోటీలకు ఎంపికై న ఏపీ పురుషులు, మహిళల జట్లకు మెరుగైన ప్రదర్శన కోసం శిక్షణ శిబిరం నిర్వహించామన్నారు. పురుషుల జట్టులో కేతా సాయి దుర్గాప్రసాద్‌, సీహెచ్‌ మోహన్‌ కృష్ణ (కోనసీమ), సి.శివ కుమార్‌, కె.మధు (కర్నూలు), సీహెచ్‌.సతీష్‌, ఎల్‌.గణపతి (తూర్పుగోదావరి), ఎ.జాకబ్‌ (ప్రకాశం), దాసరి సతీష్‌ (కృష్ణా జిల్లా) ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement