● మున్సిపల్‌ బరిలో భార్యాభర్తలు | - | Sakshi
Sakshi News home page

● మున్సిపల్‌ బరిలో భార్యాభర్తలు

Oct 27 2026 12:15 AM | Updated on Oct 27 2026 12:15 AM

నిడదవోలు మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ తరఫున భార్యా భర్తలు రెండు వార్డుల్లో పోటీ చేస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ పట్టణ కార్యదర్శి తోలేటి కోట సత్యనారాయణ (కోటి)కు 28వ వార్డు (జనరల్‌) కౌన్సిలర్‌ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త జి.శ్రీనివాస నాయుడు అవకాశం కల్పించారు. అలాగే జనరల్‌ మహిళకు కేటాయించిన 25వ వార్డు నుంచి కోటేశ్వరరావు భార్య తోలేటి ఝాన్సీబరిలో నిలిచారు. కాగా.. ఝాన్సీ 2021– 26 వరకు పట్టణంలో 26వ వార్డు వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్‌గా పనిచేశారు. – నిడదవోలు

● అక్కాచెల్లెళ్ల ప్రచారం

పెద్దాపురం మున్సిపాలిటీ కౌన్సిలర్‌ అభ్యర్థులుగా వైఎస్సార్‌ సీపీ తరఫున అక్కాచెల్లెళ్లు పోటీలో నిలిచారు. పట్టణానికి చెందిన పార్టీ నాయకుడు కసిరెడ్డి శ్రీనివాసరావు కుమార్తైలెన సరిత (16 వార్డు), గౌతమిశ్రీ (19 వార్డు) బరిలో నిలిచారు. పార్టీ పెద్దాపురం కో ఆర్డినేటర్‌ దవులూరి దొరబాబు వీరికి అవకాశం కల్పించారు. నామినేషన్లు దాఖలు చేసిన నాటి నుంచి ఇద్దరు అక్కచెల్లెళ్లు ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ, ప్రతి ఒక్కరినీ కలుస్తూ, ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు. – పెద్దాపురం

● కౌన్సిలర్‌ అభ్యర్థిగా వలంటీర్‌

నిడదవోలు పట్టణానికి చెందిన గుండుమోగుల దేవీ ధనలక్ష్మి వైఎస్సార్‌ సీపీ తరఫున 27 వార్డులో కౌన్సిలర్‌గా పోటీలో నిలిచారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఆమె ఇక్కడే వలంటీర్‌గా ప్రజలకు ఎన్నో సేవలందించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన దేవీ ధనలక్ష్మి డిగ్రీ వరకు చదువుకున్నారు. వలంటీర్‌గా ఆమె అందించిన సేవలను గుర్తించిన మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ కో ఆర్డినేడర్‌ జి.శ్రీనివాస నాయుడు 27వ వార్డులో కౌన్సిలర్‌ అభ్యర్థిగా అవకాశం ఇచ్చి, బీఫాం కూడా అందజేశారు. – నిడదవోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement