చేపల ఫీడ్‌ దుకాణంలో అగ్నిప్రమాదం | - | Sakshi
Sakshi News home page

చేపల ఫీడ్‌ దుకాణంలో అగ్నిప్రమాదం

Oct 27 2026 12:15 AM | Updated on Oct 27 2026 12:15 AM

కరప: నడకుదురులోని చేపల చెరువుల కెమికల్స్‌, ఫీడ్‌ దుకాణంలో సోమవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ దుకాణంలో సుమారు రూ 1.50 కోట్ల విలువైన బ్లీచింగ్‌, చేపల మేత, చెరువులకు సంబంధించిన కెమికల్స్‌ ఉన్నాయి. మంటలు రేగిన వెంటనే షాపు యజమాని చల్లగుంట్ల మహాలక్ష్మి ఇచ్చిన సమాచారంతో కాకినాడ నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి అదుపు చేశారు. ఈ ఘటనలో సుమారు రూ.50 లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్లు అంచనా.

పనులపై అవగాహన అవసరం

సామర్లకోట: వీబీజీ రామ్‌ జీ పథకంలోని పనులపై అవగాహన పెంచుకోవాలని విస్తరణ శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్‌ కేఎన్‌వీ ప్రసాదరావు అన్నారు. స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో 12 జిల్లాల్లోని వీబీజీ రామ్‌జీ పథకంలోని ఏపీఓ, ఈసీలకు రెండు రోజుల పాటు నిర్వహించే శిక్షణను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చేయాల్సిన పనులను గుర్తించి రైతులు, ప్రజలకు అవసరమైన వాటికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పథకంలో పనిచేస్తున్న 230 మంది సిబ్బందికి బ్యాచ్‌ల వారీగా శిక్షణ ఇస్తామన్నారు. అనంతరం శిక్షణకు హాజరైన వారికి మెటీరియల్‌ అందజేశారు. రిసోర్సు పర్సన్లు స్వరూపరాణి, కిరణ్‌. పవన్‌కుమార్‌, ఈటీసీ ప్యాకల్టీలు శిక్షణ ఇచ్చారు.

గుర్తు తెలియని

వ్యక్తి మృతి

రాజమహేంద్రవరం రూరల్‌: శాటిలైట్‌ సిటీలోని పిట్లవానిచెరువు వద్ద సోమ వారం సుమారు 35 నుంచి 40 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని బొమ్మూరు ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.అంకారావు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు బొమ్మూరు ఇన్‌స్పెక్టర్‌ కాశీవిశ్వనాథ్‌ 94407 96533, ఎస్సై 82474 08275 నంబర్లకు తెలిపాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement