రత్నగిరికి కార్తిక శోభ | - | Sakshi
Sakshi News home page

రత్నగిరికి కార్తిక శోభ

Oct 27 2026 12:15 AM | Updated on Oct 27 2026 12:15 AM

ఫ వచ్చే నెల 4 నుంచి సత్యదీక్షలు

ఫ 21న సత్యదేవుని తెప్పోత్సవం,

24న గిరి ప్రదక్షిణ

ఫ దేవస్థానం విస్తృత ప్రచారం

అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో నవంబర్‌ నాలుగో తేదీ నుంచి సత్యదీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటిపై దేవస్థానం విస్తృత ప్రచారం చేపట్టింది. పోస్టర్లను పంపిణీ చేయడంతో పాటు మైకు ద్వారా ప్రచారం చేస్తోంది. అలాగే కార్తిక మాసంలో నవంబర్‌ 21న పంపా నదిలో జరిగే సత్యదేవుని తెప్పోత్సవం, 24న కార్తిక పౌర్ణమి రోజు గిరిప్రదక్షిణపై కూడా అవగాహన కల్పిస్తున్నారు. వ్రత పురోహిత సంఘం అధ్యక్షుడు చామర్తి కన్నబాబు దేవస్థానంలో మైక్‌ ద్వారా సత్యదీక్షలు ఆచరించడం వల్ల కలిగే సత్ఫలితాలను వివరిస్తున్నారు.

గిరిజన భక్తులకు దీక్షా వస్త్రాల బహూకరణ

రంపచోడవరం, అడ్డతీగల మండలాల్లోని గిరిజన భక్తులకు సత్యదీక్షలు ఆచరించేందుకు వీలుగా దీక్షా వస్త్రాలు, మాలలను సోమవారం అందజేశారు. దేవస్థానానికి చెందిన సత్యరథంపై ఆయా ప్రాంతాలకు వెళ్లి ఏఈఓ కృష్ణ ప్రసాద్‌, సూపరింటెండెంట్‌ విష్ణు, ఇతర సిబ్బంది వాటిని పంపిణీ చేశారు. ప్రతి ఏటా సుమారు 500 మంది గిరిజన భక్తులకు దీక్షా వస్త్రాలు అందజేయడం ఆనవాయితీగా వస్తోంది.

27 రోజుల దీక్ష

ఏటా కార్తికమాసానికి ముందు సత్యదేవుని జన్మనక్షత్రం మఖ నాడు సత్యదీక్షలను అన్నవరం దేవస్థానంలో అధికారికంగా ప్రారంభిస్తారు. 27 రోజుల తర్వాత కార్తిక మాసంలో వచ్చే మఖ నక్షత్రం నాడు దీక్షలను విరమిస్తారు. ఆ ప్రకారం నవంబర్‌ నాలుగున దీక్ష స్వీకరించి, డిసెంబర్‌ ఒకటో తేదీన విరమణ చేయాలని పండితులు తెలిపారు. 27 రోజుల దీక్ష ఆచరించే అవకాశం లేని మహిళలు, ఇతరులు 18 రోజుల దీక్షను నవంబర్‌ 13 నుంచి ఆచరించాలి. అలాగే తొమ్మిది రోజులు దీక్ష చేసేవారు నవంబర్‌ 22న మొదలుపెట్టారు. వీరందరూ డిసెంబర్‌ ఒకటిన దీక్ష విరమించాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement