కన్నీరు పెట్టుకున్న వైఎస్సార్ సీపీ కార్యకర్త
కిర్లంపూడి: ఎన్నికల్లో స్వేచ్ఛగా పోటీ చేసే హక్కు ప్రతిపక్షాలకు లేదా? అధికార పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేస్తే భయభ్రాంతులకు గురిచేస్తారా..? అంటూ ముక్కొల్లు గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త మేడిబోయిన నాగార్జున కన్నీటి పర్యంతమయ్యాడు. శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ముక్కొల్లు ఎంపీటీసీ అభ్యర్థిగా తాను ప్రతిపదించిన వ్యక్తిని కూటమి నాయకులు భయభ్రాంతులకు గురిచేసి అన్యాయంగా నామినేషన్ ఉపసంహరించుకునేలా చేశారని అన్నారు. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని ఎదుర్కొనే శక్తి లేక అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. మూడు రోజులుగా తనను మానసికంగా అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


