కాకినాడ క్రైం: పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఓపెన్ హౌస్ ఆయుధ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లాలో విఽవిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు హాజరయ్యారు. ఆయుధాల పనితీరును ఎస్పీ బిందుమాధవ్ వివరించారు. అమరవీరుల సంస్మరణార్థం సాయంత్రం భానుగుడి కూడలిలో నిర్వహించిన పోలీస్ బ్యాండ్ షో అబ్బురపరిచింది. ఈ కార్యక్రమాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించారు. అడ్మిన్ ఎస్పీ కిషోర్‌కుమార్ బ్యాండ్ షో ప్రాధాన్యతను వివరించారు.


