తిరుగు ప్రయాణం అవస్థల మయం | - | Sakshi
Sakshi News home page

తిరుగు ప్రయాణం అవస్థల మయం

Oct 22 2026 12:39 AM | Updated on Oct 22 2026 12:39 AM

● బస్సుల కోసం ప్రయాణికుల ఎదురుచూపు

● సకాలానికి రాకపోవడంతో ఇబ్బందులు

● నిర్వహణలో అధికారుల అలసత్వం

రాజమహేంద్రవరం సిటీ: బస్సులు సమయ వేళలు పాటించకపోవడంతో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. దసరా సెలవులు ముగియడంతో ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సుల ఆలస్యంతో బుధవారం తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మహిళలు అధిక సంఖ్యలో ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసి నడుస్తున్నాయి. పండగ రద్దీ దృష్ట్యా సరిపడినన్ని బస్సులు నడపడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం అవసరమైన ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించినప్పటికీ ఆచరణలో కనిపించడం లేదని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు.

తిరుగు ప్రయాణాలకు 100 ప్రత్యేక బస్సులు

దసరా పండగకు వచ్చిన ప్రయాణికుల తిరుగు ప్రయాణాలకు వంద ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు డీపీటీఓ మనోహర్‌ తెలిపారు. రాజమహేంద్రవరం డిపో 70, కొవ్వూరు 10, నిడదవోలు 10, గోకవరం డిపో 10 బస్సులను ఆదివారం వరకు నడిపేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు

దసరా ఆదాయం రూ.34 లక్షలు

దసరా సందర్భంగా రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడదవోలు, గోకవరం ఆర్టీసీ డిపో నుంచి హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నగరాలకు నడిపిన 150 ప్రత్యేక బస్సుల ద్వారా సుమారు రూ.34 లక్షల ఆదాయం లభించిదని డీపీటీఓ మనోహర్‌ తెలిపారు. 70 వేల కిలోమీటర్లు రాకపోకలు సాగించిన ఈ బస్సుల్లో 25 వేల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరినట్టు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement