చింతూరు: దసరా పండగ అందరి ఇళ్లలో సరదా నింపితే.. ఆ రెండు ఇళ్లలో రోదనలు.. కన్నీటి ప్రవాహాలను పారించింది. మేనత్తకు కొత్త దుస్తులు ఇచ్చి తిరిగి వస్తూ ఒకరు.. ఏదో పనిపై వెళ్తూ మరొకరు వారి వారి వాహనాలపై వెళ్తూ ఎదురెదురుగా ఢీకొని మృతి చెందారు. వివరాల్లోకి వెళితే మండలం పోతనపల్లి సమీపంలో మంగళవారం ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో సుకుమామిడికి చెందిన పల్లాల రమణారెడ్డి (40), చూటూరుకు చెందిన పాయం అశోక్ (26) మృతిచెందారు. చింతూరు మండలం ఎర్రంపేటలో అరకు కాఫీ దుకాణం నిర్వహిస్తున్న రమణారెడ్డి పండగకని తన మేనత్తకు కొత్త దుస్తులు ఇచ్చేందుకు బైక్‌పై స్వగ్రామం సుకుమామిడి వెళ్లి తిరిగి వస్తుండగా చింతూరు వైపు నుండి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న చూటూరుకు చెందిన పాయం అశోక్ బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో రమణారెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా అశోక్‌ను చింతూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఎస్‌ఐ సంతోష్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరి మృతి


