కాకినాడ రూరల్: వాకలపూడి ఫిషింగ్ హార్బర్‌ను జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదివారం పరిశీలించారు. హార్బర్ నుంచి మత్స్య ఎగుమతులు, సముద్రంలో చేపల వేట, వ్యాపార లావాదేవీలు, మౌలిక సదుపాయాల గురించి మత్స్యశాఖ అధికారి కృష్ణారావును అడిగి తెలుసుకున్నారు. షిషింగ్ హార్బర్‌కు ప్రస్తుతం ఎన్ని బోట్లు వస్తున్నాయి.. రోజూ ఎంత మేర వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి... రొయ్యలు, చేపలు ఏ ఏ ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయనేది తెలుసుకున్నారు. అంతర్జాతీయ ఎగుమతులకు సంబంధించి నిబంధనలకు అనుగుణంగా హార్బర్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన అంశాలపై అధికారులతో చర్చించారు. అనంతరం కుంభాబిషేకం షిష్ ల్యాండింగ్ సెంటర్‌ను సందర్శించారు. ఈ కేంద్రం నుంచి చేపల వేటకు వెల్లే బోట్లు ఏ ఏ రకాల చేపలను వేటాడుతున్నాయనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.


