‘ఫ్యాన్‌’ గూటికి చేరారు | - | Sakshi
Sakshi News home page

‘ఫ్యాన్‌’ గూటికి చేరారు

Oct 18 2026 12:24 AM | Updated on Oct 18 2026 12:24 AM

కిర్లంపూడి: ఎన్నికల వేళ ఫ్యాన్‌ గూటికి కూటమి నేతలు చేరుతున్నారు. వైఎస్సార్‌ సీపీపై నమ్మకంతో పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున వైఎస్సార్‌ సీపీలో చేరి ఆ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ ముద్రగడ గిరిబాబుతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. శనివారం శంఖవరం మండలం కత్తిపూడికి చెందిన జనసేన ముఖ్య నాయకుడు గాబు కృష్ణ, ఆయనతో పాటు మరో 30 కుటుంబాలు కిర్లంపూడిలోని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యుడు దివంగత ముద్రగడ పద్మనాభం నివాసంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. వారికి కో ఆర్డినేటర్‌ ముద్రగడ గిరిబాబు పార్టీ కండువాలు వేసి సాదరంగా అహ్వానించారు. ఈ సందర్భంగా గాబు కృష్ణ మాట్లాడుతూ పార్టీ విజయమే లక్ష్యంగా గిరిబాబుతో కలిసి పనిచేస్తామని తెలిపారు.

జగ్గంపేట మండలంలో..

జగ్గంపేట: మండలంలోని భావవరం గ్రామానికి చెందిన మరికొంత మంది టీడీపీని వీడి వైఎస్సార్‌ సీపీలో చేరారు. రెండు రోజుల క్రితం 50 కుటుంబాలు టీడీపీకి గుడ్‌ బై చెప్పడం తెలిసిందే. శనివారం మరికొన్ని కుటుంబాలు ఇర్రిపాక గ్రామంలో మాజీ ఎమ్మెల్యే, సీఈసీ మెంబర్‌ జ్యోతుల చంటిబాబు సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. చంటిబాబు వారందరికీ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో భావవరం గ్రామానికి చెందిన కంచి లక్ష్మణదొర, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

క్యూ కడుతున్న కూటమి నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement