[Ýët…VŠæ Æý‡*ÐŒl$ÌS ˘ ఏర్పాటుపై పరిశీలన | - | Sakshi
Sakshi News home page

[Ýët…VŠæ Æý‡*ÐŒl$ÌS ˘ ఏర్పాటుపై పరిశీలన

Oct 18 2026 12:24 AM | Updated on Oct 18 2026 12:24 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ఎంపీటీసీ, జేడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కాకినాడలోని పీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్‌ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను శనివారం జిల్లా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగేందుకు వీలుగా కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్‌ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాలకు స్థల పరిశీలన చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, భద్రతా ప్రమాణాలు, ప్రవేశ మార్గాలు ఇతర ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద సీసీ కెమెరాల నిఘా, 24 గంటల పోలీస్‌ బందోబస్తుతో పాటు అవసరమైన సాంకేతిక వసతులను సమకూర్చాలని ఆదేశించారు.

పకడ్బందీగా విధులు నిర్వర్తించండి

స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యంత పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ ఆదేశించారు. స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై జోనల్‌, రూట్‌ అధికారులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు తదితర బృందాలకు శిక్షణ చ్చారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, నిబంధనల ఉల్లంఘనల గుర్తింపు, తనిఖీల నిర్వహణ, సీజింగ్‌ ప్రక్రియ, నివేదికల సమర్పణ తదితర కీలక అంశాలపై అవగాహన కల్పించారు.

సిబ్బంది నియామకం

జిల్లా పరిషత్‌ పరిధిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు, పోలింగ్‌ సిబ్బందిని నియమిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement