అన్నవరం: శుభములివ్వు సత్యదేవా అంటూ అన్నవరంలోని వీర వెంకట సత్యనారాయణ స్వామివారిని భక్తులు కొలిచారు. శనివారం రత్నగిరి భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ప్రాంగణం, వ్రతమండపాలు, విశ్రాంత మండపాలు నిండిపోయాయి. సత్యదేవుని దర్శనానికి రెండు గంటలు, రూ.200 టిక్కెట్‌తో అంతరాలయ దర్శనానికి గంట సమయం పట్టింది. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారు. స్వామివారి వ్రతాలు 1,500 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం సమకూరింది. ఐదు వేల మంది భక్తులకు సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో ఉచిత భోజన సౌకర్యం కల్పించారు.


