అమలాపురం టౌన్: ఇటీవల కాకినాడలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యాన జరిగిన రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో అమలాపురం హెల్త్ అండ్ ఫిట్‌నెస్ జిమ్‌లో శిక్షణ పొందుతున్న ముగ్గురు క్రీడాకారులు వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచారు. వాసంశెట్టి మేఘన (అండర్–17 విభాగం 86+ కేజీల కేటగిరీ), గుంటూరు దినేష్ ప్రసాద్ (అండర్–17 విభాగం 76 కేజీల కేటగిరీ), కొండేటి వేణు మానస్ (అండర్–19 విభాగం 76 కేజీల కేటగిరీ) విజేతలుగా నిలిచారని కోచ్ డాక్టర్ కంకిపాటి వెంకటేశ్వరరావు తెలిపారు. జిమ్‌లో బుధవారం జరిగిన అభినందన కార్యక్రమంలో విజేతలను వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రతినిధులు, తోటి బాడీ బిల్డర్లు, క్రీడాకారులు అభినందించారు. విజేతలకు రూ.8 వేల విలువైన పోష్టికాహార టిన్‌లను జిమ్ లైఫ్ మెంబర్ గారపాటి చంద్రశేఖర్ అందజేశారు. విజేతలను నేషనల్ వెయిట్ లిఫ్టర్లు మారే వీరేంద్ర, బి.యశ్వంత్, దివ్యతేజ, విద్యా నికేతన్ స్కూలు కరస్పాడెంట్ ముమ్మిడి ప్రతాప్ తదితరులు సత్కరించారు.


