అమ్మవారికి మనసు అర్పించడమే ఆధ్యాత్మిక సాధన | - | Sakshi
Sakshi News home page

అమ్మవారికి మనసు అర్పించడమే ఆధ్యాత్మిక సాధన

Oct 15 2026 8:36 AM | Updated on Oct 15 2026 8:36 AM

కాకినాడ రూరల్‌: అమ్మవారికి మనసును అర్పించడమే నిజమైన ఆధ్యాత్మిక సాధన అని కాకినాడ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి అన్నారు. మనసు అనే పీఠంపై అహంకారం ఉన్నంత కాలం దైవ చింతనకు సంపూర్ణ స్థానం కల్పించలేమని చెప్పారు. రమణయ్యపేటలోని శ్రీపీఠంలో మహాశక్తి యాగంలో భాగంగా కుంకుమ పూజలు బుధవారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. వేలాదిగా వచ్చిన భక్తులనుద్దేశించి స్వామీజీ మాట్లాడుతూ, శ్రీపీఠం యాగశాలలో ప్రతి రోజూ వారాహి, బగళాముఖి, ప్రత్యంగిర తదితర దేవతలకు నవశక్తి హోమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. శరభేశ్వరుడు, ప్రత్యంగిర, మార్తాండ భైరవుడు, క్షేత్రపాలుడు, నకులేశ్వరి, దండిని తదితర దేవతల ఆరాధనలోని ఆధ్యాత్మిక భావనలను వివరించారు. బెంగళూరు, చైన్నె, హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలు, వివిధ రాష్ట్రాల నుంచి సేకరించిన కమలాలతో అష్టమి నాడు అమ్మవారికి విశేష అలంకరణ చేస్తామన్నారు. సాయంత్రం హరిద్ర (పసుపు) అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారని చెప్పారు. దాతల సహకారంతో ప్రతి రోజూ వేలాది మందికి అన్న ప్రసాదం వితరణ చేస్తున్నామని స్వామీజీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement