దేవస్థానం ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ | - | Sakshi
Sakshi News home page

దేవస్థానం ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ

Oct 15 2026 8:36 AM | Updated on Oct 15 2026 8:36 AM

అన్నవరం: దేవస్థానం ఆసుపత్రిని ఈఓ నల్లం సూర్యచక్రధరరావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫార్మసీలో మందుల ఎక్స్‌పైరీ తేదీలను పరిశీలించారు. ఆసుపత్రిలో ఉన్న మందుల వివరాలను ఫార్మసీ సూపర్‌వైజర్‌ వల్లూరి మాధవిని అడిగి తెలుసుకున్నారు. అత్యవసర మందులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రి చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో దేవస్థానంలో శానిటరీ కాంట్రాక్ట్‌ నిర్వహిస్తున్న పద్మావతి సంస్థ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో ఆసుపత్రి ఆవరణంతా శుభ్రం చేయాలని ఆదేశించారు. కాగా, దేవస్థానం వైద్యాధికారి పాండురంగారావు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ రత్నగిరి పైనే సేవలందిస్తున్న విషయం తెలిసిందే. ఆయన దేవస్థానం ఆసుపత్రికి రాకపోవడంతో భక్తులు, గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. ఈ అంశాన్ని గత సెప్టెంబర్‌ 25న ప్రచురించిన కథనంలో ‘సాక్షి’ ప్రస్తావించింది. వైద్యాధికారి శని, ఆదివారాలు, దశమి, ఏకాదశి వంటి పర్వదినాల్లో రత్నగిరి పైన, మిగిలిన రోజుల్లో దేవస్థానం ఆసుపత్రిలోను సేవలందిస్తే బాగుంటుందని సూచించింది. తన తనిఖీలో గ్రామస్తుల ఇబ్బందిని ఈఓ స్వయంగా తెలుసుకున్నారు. దీంతో, ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ డాక్టర్‌ పాండురంగారావు దేవస్థానం ఆసుపత్రిలో సేవలందించాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement