బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): డ్వామా పీడీగా ఆర్.విజయరాజు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఇక్కడ పీడీగా పని చేసిన మధుసూదన్ నెల్లూరు జిల్లా పరిషత్ సీఈఓగా బదిలీ కావడంతో ఆయన స్థానంలో తూర్పు గోదావరి జిల్లా డ్వామా కార్యాలయంలో విజిలెన్స్ అధికారిగా పని చేస్తున్న విజయరాజును ప్రభుత్వం నియమించింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం విజయరాజు కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. విజయరాజును కార్యాలయ సిబ్బంది కూడా మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.


