గ్రంథాలయాలకు చంద్రగ్రహణం | - | Sakshi
Sakshi News home page

గ్రంథాలయాలకు చంద్రగ్రహణం

Oct 14 2026 12:11 AM | Updated on Oct 14 2026 12:11 AM

విజ్ఞాన కాంతుల్ని పంచే గ్రంథాలయాలకు ‘చంద్ర’గ్రహణం పట్టుకుంది. ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించక.. అవసరమైన పుస్తకాలు కొనలేక.. చాలినంత మంది సిబ్బంది లేక ఈ సరస్వతీ నిలయాలు సతమతమవుతున్నాయి. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో గ్రంథాలయాల అభివృద్ధికి పెద్ద పీట వేయగా.. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం వీటిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. ఈ పరిస్థితిపై పుస్తకాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆలమూరు: విద్యార్థులకు ఎంతో బాసటగా నిలుస్తూ.. జ్ఞాన దీపాలను వెలిగిస్తున్న గ్రంథాలయాలను చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం గ్రంథాలయాల అభివృద్ధికి, ఉద్యోగుల జీతభత్యాలకు రాష్ట్ర బడ్జెట్‌లో రూ.130 కోట్లు కేటాయించింది. దీనిని ప్రస్తుత కూటమి ప్రభుత్వం రూ.30 కోట్లకు తగ్గించింది. బడ్జెట్‌ కేటాయింపుల్లో ఏకంగా రూ.100 కోట్ల మేర కోత పెట్టింది. దీనికితోడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థలు గ్రంథాలయ సెస్‌ను జిల్లా గ్రంథాలయ సంస్థకు చెల్లించడం లేదు. వీటన్నింటి ఫలితంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గ్రంథాలయాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి.

రూ.30 కోట్లు పైగా సెస్‌ బకాయిలు

నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలు, నగర, గ్రామ పంచాయతీల్లో నివసిస్తున్న ప్రజలు ఏటా క్రమం తప్పకుండా 8 శాతం మేర గ్రంథాలయ పన్ను (సెస్‌) చెల్లిస్తున్నారు. కానీ, ఆ మొత్తాన్ని ఆయా స్థానిక సంస్థలు జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థకు జమ చేయడం లేదు. ఈవిధంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.30 కోట్లకు పైగా బకాయిలున్నాయి. అటు ప్రభుత్వం నుంచి బడ్జెట్‌ కేటాయింపులు దారుణంగా తగ్గిపోవడం.. ఇటు స్థానిక సంస్థలు సెస్‌ సక్రమంగా చెల్లించకపోవడంతో గ్రంథాలయాల్లో అభివృద్ధి పూర్తిగా స్తంభించిపోయింది. కొత్త పుస్తకాలు కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోవడంతో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీనికితోడు గ్రంథాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఒక నెల వేతనాలు బకాయి పెట్టింది. రిటైర్డ్‌ ఉద్యోగులకై తే ఏకంగా రెండు నెలలుగా పింఛన్లు చెల్లించడం లేదు. ఈవిధంగా గ్రంథాలయ ఉద్యోగులు, రిటైర్డ్‌ సిబ్బందికి సుమారు రూ.3.2 కోట్ల వరకూ సర్కారు చెల్లించాల్సి ఉంది. మరోవైపు ఖాళీ పోస్టులను కూడా భర్తీ చేయడం లేదు. ఫలితంగా గ్రంథాలయాల్లో పాఠకులకు సక్రమంగా సేవలు అందడం లేదు.

దుర్భరంగా పింఛన్‌దారుల జీవనం

ప్రభుత్వం రెండు నెలలుగా పెన్షన్‌ చెల్లించకపోవడంతో గ్రంథాలయాల్లో పని చేసి, రిటైరైన ఉద్యోగులు దుర్భర జీవితం గడుపుతున్నారు. నిత్యావసర వస్తువులు, వృద్ధాప్యంలో అవసరమైన మందుల కొనుగోళ్లకు వారు అప్పుల పాలవుతున్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం మాదిరిగా ప్రతి నెలా ఠంచన్‌గా ఒకటో తేదీనే పెన్షన్‌ ఎందుకు చెల్లించడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. సామాజిక పింఛన్ల మాదిరిగానే తమకు కూడా ప్రతి నెలా ఒకటో తేదీకి పెన్షన్‌ చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గ్రంథాలయాల వివరాలు

మొత్తం గ్రంథాలయాలు 102

గ్రామీణ గ్రంథాలయాలు 3

పుస్తక నిక్షిప్త కేంద్రాలు 161

ఉండాల్సిన ఉద్యోగులు 294

ప్రస్తుతం ఉన్న వారు 57

ఖాళీ పోస్టులు 237

పింఛన్‌దారులు 167

బడ్జెట్‌ కేటాయింపులపై గణనీయంగా వేటు

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో

రూ.130 కోట్లు

దీనిని రూ.30 కోట్లకే పరిమితం చేసిన కూటమి సర్కారు

సక్రమంగా అందని వేతనాలు

ఆర్థిక కష్టాల్లో పెన్షనర్లు, ఉద్యోగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement