చైతన్యరాజుకు జీవిత సాఫల్య పురస్కారం | - | Sakshi
Sakshi News home page

చైతన్యరాజుకు జీవిత సాఫల్య పురస్కారం

Oct 14 2026 12:11 AM | Updated on Oct 14 2026 12:11 AM

అమలాపురం రూరల్‌: తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని గోదావరి గ్లోబల్‌ యూనివర్సిటీ కులపతి, అమలాపురం కిమ్స్‌ వైద్య కళాశాల అధినేత, చైతన్య గ్రూప్‌ వ్యవస్థాపక చైర్మన్‌ కేవీవీ సత్యనారాయణరాజు(చైతన్యరాజు)కు అమెరికాలోని డల్లాస్‌ అడాప్ట్‌ ఏ విలేజ్‌ గ్లోబల్‌ ఫౌండేషన్‌ జీవిత సాఫల్య పురస్కారం ప్రకటించింది. వైద్యం, విద్య, సామాజిక సేవా రంగాలతో పాటు తెలుగు భాషా వికాసానికి చేస్తున్న కృషికి గాను ఆయనకు ఈ పురస్కారం ప్రకటించినట్లు సంస్థ ప్రతినిధులు మంగళవారం వెల్లడించారు. చైతన్యరాజు ఎమ్మెల్సీగా, ప్రభుత్వ విప్‌గా, ఈబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా వివిధ బాధ్యతలు నిర్వహించారు. జీవిత సాఫల్య పురస్కారం ప్రకటించిన సంస్థ సభ్యుడు భూపతిరాజు పండిత్‌కు చైతన్యరాజు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement