8 మందికి ఉద్యోగోన్నతి | - | Sakshi
Sakshi News home page

8 మందికి ఉద్యోగోన్నతి

Oct 14 2026 12:11 AM | Updated on Oct 14 2026 12:11 AM

అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో రికార్డు అసిస్టెంట్లుగా పని చేస్తున్న ఎనిమిది మందికి జూనియర్‌ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి కల్పించారు. ఈ మేరకు ఆ సిబ్బందికి అన్నవరం దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు మంగళవారం ఉత్తర్వులు అందశారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా సేవలందించి, దేవస్థానానికి మంచి పేరు తేవాలని వారిని ఆదేశించారు.

చేపల వేటకు వెళ్లి

వ్యక్తి మృతి

కోరుకొండ: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తూ తొర్రిగెడ్డ కాలువలో పడి మృతి చెందాడు. ఎస్సై ఆర్‌.శివాజీ కథనం ప్రకారం.. మధురపూడికి చెందిన జగంధం ఏడుకొండలు (43) చేపల వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 11న బుచ్చెంపేట శివారున ఉన్న తొర్రిగెడ్డ కాలువలో చేపలు వేటాడుతూ ప్రమాదవశాత్తూ దానిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న బంధువులు.. స్థానికుల సహకారంతో 12వ తేదీన గాలించగా, 13న ఏడుకొండలు మృతదేహం దొరికింది. వారి సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి బంధువుల ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. ఏడుకొండలుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement